Begin typing your search above and press return to search.

ఆడపడుచును ఏడిపించేసిన కరీనా

By:  Tupaki Desk   |   14 Dec 2017 10:22 AM IST
ఆడపడుచును ఏడిపించేసిన కరీనా
X
బాలీవుడ్ హీరో సైఫ్ ఆలీఖాన్ ను పెళ్లాడి పటౌడీ రాజ కుటుంబంలో సభ్యురాలై పోయింది. ఈ మధ్యనే ఓ బిడ్డకు జన్మనిచ్చి తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ నచ్చి నటించడం మొదలెట్టింది. సైఫ్ సోదరి.. తనకు ఆడపడుచు అయ్యే సోహా ఆలీఖాన్ ను ఈ మధ్య తన మాటలతో కంటతడి పెట్టించేసింది కరీనా.

సోహా ఆలీఖాన్ తాజాగా ఓ పుస్తకం రాసింది. దాని పేరు ‘ద పెరిల్స్ ఆఫ్ బియింగ్ మోడరేట్లీ ఫేమస్’. ఈ పుస్తకం ఆవిష్కరణ సభకు పటౌడీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అటెండయ్యారు. ఇదే ప్రోగ్రాంకు కరీనా కూడా వచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పుస్తకానికి పెట్టిన టైటిల్ నచ్చలేదని అనేసింది. ఎందుకంటే ‘‘ఫేమస్ కావచ్చు.. కాకపోవచ్చు. కానీ సోహా మాత్రం కుటుంబం అంతటికి వెలుగు’’ అంటూ కితాబిచ్చేసింది. తనను సోహా ఎప్పుడూ తనను మాటల్తో తెగ బెదిరించేసేదని కరీనా చెప్పుకొచ్చింది. సైఫ్ అండ్ సోహా మాటల్లో పడితే వాళ్లతో కలవడం చాలా కష్టమని చెప్పేసింది. మొత్తంమీద తన మాటల్తో సోహాను ఆకాశానికెత్తేసింది. వదిన నోటి వెంట వచ్చిన మాటలతో సోహాకు ఆనందంతో కళ్లవెంట నీళ్లు ఆగకుండా వచ్చేశాయి. సైఫ్ ఆమెను వారించినా ఏడుపు ఆపుకోవడం తనవల్ల కాలేదంటూ చెప్పిన మాటలు అక్కడున్న వారందరినీ మెప్పించేశాయి.

సహ నటుడు కునాల్ ఖేమును పెళ్లాడిన సోహాకు ఇనాయా అనే కూతురింది. కూతురితో కలిసి తను రాసిన పుస్తకాన్ని తిరగేస్తున్న ఫొటోను ఈమధ్య సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన ప్రెగ్నెన్సీ టైంలో వదిన కరీనా తనకు ఎంతో సాయం చేసిందని సోహా చెప్పుకొచ్చింది. ‘‘రోజూ నాకు ఎన్నో సందేహాలొచ్చేవి. ఏం తినాలి.. ఏం చేయాలి.. ఏం చేయకూడదు.. ఇలా అన్నింటికీ ఓపిగ్గా బదులిచ్చేది’’ అంటూ ఆమెను ప్రశంసల్లో ముంచెత్తింది.