Begin typing your search above and press return to search.

దివి నుంచి భువికి దిగి వ‌చ్చిన సీఈవో బెబో

By:  Tupaki Desk   |   30 Jun 2021 9:00 PM IST
దివి నుంచి భువికి దిగి వ‌చ్చిన సీఈవో బెబో
X
మస‌క మ‌స‌క చీక‌టిలో మ‌ల్లె తోట వెన‌కాల‌ మాప‌టేల క‌లుసుకో.. నీ మ‌న‌సైన‌ది దొరుకుతుంది...మ‌న‌సైన‌ది దొరుకుతుంది... ఓకే..! ఇలాంటి క్లాసిక్ మ‌సాలా సాంగ్స్ విని చాలా కాల‌మే అయ్యింది. ఇటీవ‌లి కాలంలో సీనియ‌ర్లు జూనియ‌ర్ భామ‌లు అనే తేడా లేకుండా సొగ‌సైన ఇన్న‌ర్ అందాల్ని ఎలివేట్ చేస్తుంటే ఆ పాట‌ల్లోని ప‌ద‌జాల గ‌మ్మ‌త్తును మించి మ‌త్తెక్కిపోతోంది..!

ఇక్క‌డ క‌నిపిస్తున్న బెబోని చూసారు క‌దా..! ఇద్ద‌రు పిల్ల‌లకు మ‌మ్మీ అన్న సంగ‌తినే మ‌రిపించేస్తున్నారు మ్యాడ‌మ్. ఇంకా టీనేజీ అందాల‌తోనే అలా కుర్ర‌కారు గుండెల్లో మ‌త్తు చ‌ల్లుతున్నారు. ప‌టౌడీ సంస్థాన కోడ‌లిపిల్ల‌గా క‌రీనా వ‌న్నె త‌ర‌గ‌ని అంద‌చందాల‌కు సైఫ్ క్లీన్ బౌల్డ్ అయిపోయి పెళ్లాడాడు. అయినా అంత‌కుముందే యువ‌త‌రం బెబో జీరో సైజ్ లుక్ కి ఫిదా అయిపోయారు. ఇంకా బెబో అవే అంద‌చందాల‌తో మైమ‌రిపిస్తూ షాకిస్తోంది.

పాల నురుగు సౌంద‌ర్యం .. అల్ట్రా మోడ్ర‌న్ క్యాట్ గాళ్ .. మ‌న‌సైన బెబో! అంటూ యువ‌త‌రం మ‌త్తెక్కిపోతోంది. దివి నుంచి భువికి దిగి వ‌చ్చిన కార్పొరెట్ సుంద‌రి అంటూ పొగిడేస్తున్నారు. సైఫీనా అలియాస్ క‌రీనా ఎక్క‌డ ఉన్నా అంద‌రిలో షో-స్టాప‌ర్ గా నిలుస్తోంది. ఫ్యాష‌న్ డిజైన‌ర్ మ‌నీష్ మ‌ల్హోత్రా ఇంట్లో జ‌రిగిన లంచ్ డేట్ కి వెళ్లిన బెబో అదిరిపోయే డ్రెస్ లో దిగిపోయింది. ప్ర‌స్తుతం ఆ ఫోటోలు కూడా అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తున్నాయి .