Begin typing your search above and press return to search.

సవతి కూతురుకి కరీనా కాంప్లిమెంట్స్

By:  Tupaki Desk   |   17 Jun 2016 7:00 PM IST
సవతి కూతురుకి కరీనా కాంప్లిమెంట్స్
X
వయసులో తనకంటే బాగా పెద్దోడే అయినా.. సైఫ్ అలీ ఖాన్ ను కరీనా కపూర్ పెళ్లాడిన విషయం తెలిసిందే. అసలు విషయం ఏంటంటే... ఈ హీరోకి ఇప్పటికే హీరోయిన్ గా తెరంగేట్రం చేయగలిగే స్టామినా ఉన్న కూతురు ఉంది. సైఫ్ కూతురు పేరు సారా అలీఖాన్. బాలీవుడ్ లో తెరంగేట్రం చేసేందుకు ఇప్పుడీ చిన్నది మహా ఉత్సాహంగా ఉంది.

అమెరికా న్యూయార్క్ లోని కొలంబియా యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసిన సారా.. ఈమధ్య ముంబైలో దిగింది. మోహిత్ సూరీ మూవీలో తెరంగేట్రానికి సిద్ధమైంది. సారా అరంగేట్రంపై సైఫ్ అలీఖాన్ రెండో భార్య - సారాకి సవతితల్లి అయిన కరీనా కపూర్ సానుకూలంగా స్పందించింది. సారా ఖచ్చితంగా మంచి నటి అవుతుందని బెబో చెప్పడం విశేషం. అంతే కాదు ఆన్ స్ర్కీన్ పై సారాను చూడాలని తెగ ఆరాటంగా ఉన్నానని కూడా అంటోంది కరీనా.

'సారా అందమై అమ్మాయే కాదు.. చాలా ఇంటెలిజెంట్ కూడా. అంతేగాక తను బాగా డేరింగ్. తను మంచి నటి అవుతుందనే నమ్మకముంది. స్క్రీన్ పై సారా యాక్టింగ్ చూడాలని నేను, సైఫ్ ఎదురుచూస్తున్నాం' అంటోంది కరీనా. సైఫ్ అలీఖాన్ కి మొదటి భార్య అమృతా సింగ్ తో జన్మించిన సంతానమే సారా ఆలీ ఖాన్. కరీనాకి బ్రదర్ వరసయ్యే ఇషాన్ ఖట్టర్ సారా తొలి చిత్రంలో నటిస్తుండడం విశేషం.