Begin typing your search above and press return to search.

A5 # 2021 RU పార్టీ.. ర‌చ్చ ర‌చ్చతో పిచ్చెక్కించిన‌ గాళ్స్ గ్యాంగ్

By:  Tupaki Desk   |   10 Jan 2021 11:00 AM IST
A5 # 2021 RU పార్టీ.. ర‌చ్చ ర‌చ్చతో పిచ్చెక్కించిన‌ గాళ్స్ గ్యాంగ్
X
బాలీవుడ్ ఫేజ్ 3 ప్ర‌పంచంలో `గాళ్స్ గ్యాంగ్` ర‌చ్చ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. పండ‌గ‌లు .. పబ్బాలు.. పార్టీలు.. ఇయ‌ర్ ఎండ్ సెల‌బ్రేష‌న్స్ ఒక‌టేమిటీ వీలున్న ప్రతి సంద‌ర్భంలో హ‌ద్దుమీరి ర‌చ్చ చేయ‌డం దానిని సోష‌ల్ మీడియాల్లో పోస్ట్ చేయ‌డం ప్ర‌తిసారీ చూస్తున్న‌దే.

ఈ గ్యాంగ్ లో కరీనా కపూర్ ఖాన్ - అమృత అరోరా- మలైకా అరోరా- నటాషా పూనవల్లా - మల్లికా భట్ వంటి ప్ర‌ముఖులు ఉన్నారు. వీళ్లంతా కొత్త సంవ‌త్స‌ర వేడుక‌ల్లో భాగంగా మ‌రోసారి తిరిగి కలుసుకున్నారు. అయితే క‌రీనా సోదరి కరిష్మా కపూర్ మాత్రం ఈసారి ఎందుక‌నో మిస్స‌య్యింది.

తాజాగా త‌న గాళ్స్ గ్యాంగ్ తో ఒక ఫోటోను పంచుకుంటూ కరీనా ఆస‌క్తిక‌ర క్యాప్ష‌న్ ఇచ్చారు. ``తిరిగి కలిశాం-లోసో మిస్సింగ్ లోరో.. హియ‌ర్ ది రియ‌ల్ క‌రిష్మా క‌పూర్`` అంటూ ట్యాగ్ చేసింది. అమృత అరోరా కూడా ఇలాంటి గ్రూప్ ఫోటోని ఇన్ ‌స్టాగ్రామ్ ‌లో షేర్ చేసి.. బే(స‌ముద్ర‌తీరం)లో ఇది అమ్మాయిల టైమ్.. మేము వేచి ఉన్నాం” అని శీర్షికను జోడించారు. అమృత పిజ్జా బాక్సుల ఫోటోను కూడా పోస్ట్ చేసి,.. “అమ్మాయిలూ ఈ రాత్రికి మనం ఇంకా ఏం అడగవచ్చు?” అంటూ కొంటె ర‌చ్చ‌ను కంటిన్యూ చేశారు.

గెట్-టుగెదర్ నుండి ఫోటోల షేరింగ్ తో పాటు.. స్నేహితులను కలుసుకున్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ నటాషా పూనవల్లా చేసిన వ్యాఖ్య ఆస‌క్తిక‌రం ``మీ మంద (గుంపు) లేకుండా జీవితాన్ని గడపలేను`` అనే కామెంట్ తో హీట్ పెంచారు మ్యామ్.

దేశంలో కరోనావైరస్ ఆంక్షలు సడలించిన తరువాత మాల్దీవుల విహారంలో బికినీల ర‌చ్చ గురించి తెలిసిన‌దే. దానికి భిన్నంగా కరీనా- మలైకా అరోరాతో కలిసి హిమాచల్ ప్రదేశ్ కి విహారయాత్రకు వెళ్ల‌గా అక్కడ సైఫ్ అలీ ఖాన్ - అర్జున్ కపూర్ `భూత్ పోలీస్` చిత్రం షూటింగ్ లో పాల్గొన్నారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ గాళ్స్ గ్యాంగ్ బే - ఏరియాలో ఇలా ర‌చ్చ‌ చేయ‌డం ఆస‌క్తిక‌రం.