Begin typing your search above and press return to search.

ఇట్టాటి చాన్సు మనకెప్పుడు వస్తుందో?

By:  Tupaki Desk   |   28 March 2018 9:57 AM IST
ఇట్టాటి చాన్సు మనకెప్పుడు వస్తుందో?
X
అభిమాన హీరోయిన్ తో ఫోటో దిగడం అంటేనే.. అదో అద్భుతమైన అఛీవ్మెంట్ లా ఉంటుంది. అలాంటిది ఆమెతో కాసింత క్లోజ్ గా దిగే ఛాన్స్ వస్తే అదెలా ఉంటుంది? ఏకంగా ఆమెను దగ్గరకు తీసుకుని కౌగిలించుకుని మరీ ఫోటో దిగడం అంటే సామాన్యమైన విషయమా? అసలు అలాంటి అవకాశం ఎవరికైనా వస్తుందా? ఏ హీరోయిన్ అయినా ఇస్తుందా?

ఇలాంటి డౌట్స్ చాలానే ఉండొచ్చు కానీ.. రీసెంట్ గా సింగపూర్ లో మనీష్‌ మల్హోత్రా ఫ్యాషన్ షో లో పార్టిసిపేట్ చేసింది కరీనా కపూర్. ఆ ఈవెంట్ లో ర్యాంప్ పై అందాల ప్రదర్శన అవగానే.. ఫ్యాన్స్ ను కలిసి వారిలో తెగ ఉత్సాహం నింపింది కరీనా. అందులో ఒక అభిమాని.. బెబోతో ఫోటో దిగాలన్న కోరికను బైట పెట్టగా.. అందుకు అమ్మడు వెంటనే సై అనేసింది. అది కూడా ఓ సినిమా షూటింగ్ మాదిరిగా.. అదేదో ఫోటోషూట్ కోసం స్పెషల్ గా ఇచ్చిన పోజుల మాదిరిగా.. ఓ పద్ధతిగా మరింత వైనంగా ఆమెకు చేరువైపోయి మరీ కరీనాను కౌగిలించేసుకున్నాడు.

ఇలా ఒక సింగపూర్ ఫ్యాన్ కరీనాను హగ్ చేసుకోవడం చూసిన ఇతర ఫ్యాన్స్ తెగ బాధపడిపోతున్నారు. వీడెక్కడి ఫ్యానండీ బాబూ.. అనుకోవడమే కాదు.. అయినా ఇంతగా తారలను ఆరాధించే తమకు.. ఇలాంటి అవకాశం హీరోయిన్లు తమకివ్వరు ఎందుకో అనుకుంటూ.. ఇండియన్ అభిమానులు ఫీలవుతున్నారు. ఇంతకీ ఈ కుర్ర ఫ్యాన్ లో ఉన్న అంతటి స్పెషాలిటీ ఏంటి బెబో?