Begin typing your search above and press return to search.

నలభైలో ఇరవై సొగసులు

By:  Tupaki Desk   |   26 March 2018 3:36 PM IST
నలభైలో ఇరవై సొగసులు
X
అనుకుంటాం కాని హీరోలే కాదు హీరొయిన్లు కూడా తమ వయసుకతీతంగా గ్లామర్ మైంటైన్ చేస్తూ సంతూర్ సోప్ తరహాలో అందాన్ని కాపాడుకుంటూ అబ్బురపరుస్తున్నారు. అందులో ముందుంటోంది బెబో బ్యూటీ కరీనా కపూర్. సైఫ్ అలీ ఖాన్ తో పెళ్లి జరిగాక తైమూర్ కు జన్మనిచ్చాక కూడా మోడలింగ్ తో పాటు యాక్టింగ్ కూడా కంటిన్యూ చేస్తూనే ఉన్న కరీనా ఇటీవలే సింగపూర్ లో జరిగిన ఫాషన్ షోలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా నిర్వహించిన ఈ షోలో హాట్ మోడల్స్ తో పోటీగా కరీనా అందాలు ఆరబోస్తూ ర్యాంప్ మీద నడిచి వస్తుంటే తను సీరియస్ గా బిడ్డ తల్లేనా అని అనుమానం వచ్చింది అక్కడున్న వారికి. ఆ ఈవెంట్ లో ఫొటోనే తనతో పాటు వెళ్లి కంపెనీ ఇచ్చిన అమ్రితా అరోరా షేర్ చేసుకుంది .

కరీనా కపూర్ సినిమాల్లోకి కం బ్యాక్ ఇచ్చేసింది.వీర్ దే వెడ్డింగ్ మూవీలో సోనం కపూర్, స్వర భాస్కర్ లతో కలిసి నటించిన కరీనా ఇకపై కూడా కొనసాగుతాను అంటోంది. 40 పడిలో ఉన్నా బాడీ ఫిట్నెస్ లో తేడా రాకుండా కరీనా మైంటైన్ చేస్తున్న తీరు చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. పక్కనే ఉన్న అమ్రిత అరోరా కూడా తక్కువేమీ లేదు లెండి. తన వయసు కూడా 40 దాటేసింది. అయినా కుర్ర హీరొయిన్లకు ధీటుగా వీళ్ళు ఇలా గ్లామర్ షో చేయటమే ఇక్కడ కిక్ ఇచ్చే విషయం. వీర్ దే వెడ్డింగ్ ఫినిషింగ్ స్టేజిలో ఉండగా మరో రెండు ప్రాజెక్ట్స్ లో కూడా కరీనా నటించబోతోంది. తైమూర్ గురించి తనకు బెంగ లేదని సినిమాని ఫ్యామిలీ బాలన్స్ చేసుకోవడం ఎలాగో తెలుసంటున్న కరీనా మరో ఐదారేళ్ళు హీరొయిన్ గా కొనసాగేలా ఉంది.