Begin typing your search above and press return to search.

బిడ్డ‌ను క‌నే ముందూ పార్టీలు వ‌దిలిపెట్ట‌ని స్టార్ హీరోయిన్..!

By:  Tupaki Desk   |   1 Feb 2021 12:08 PM IST
బిడ్డ‌ను క‌నే ముందూ పార్టీలు వ‌దిలిపెట్ట‌ని స్టార్ హీరోయిన్..!
X
బాలీవుడ్ లో పార్టీ క‌ల్చ‌ర్ గురించి.. గాళ్స్ గ్యాంగ్స్ ర‌చ్చ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. కరీనా కపూర్ ఖాన్ .. మలైకా అరోరా.. అమృత అరోరా.. క‌రిష్మా క‌పూర్.. వీళ్లంతా ఒక గ్యాంగ్. వీలున్న ప్ర‌తి అకేష‌న్ ని ఎంతో చిలౌట్ గా సెలబ్రేట్ చేయ‌డానికి అల‌వాటు ప‌డిన ఫేజ్ 3 ప్రపంచపు మ‌హారాణులుగా పాపుల‌ర‌య్యారు.

ఇంత‌కుముందు కొత్త సంవ‌త్స‌రం వేడుక‌ల‌ను గోవా బీచ్ లోని అరోరా కాంపౌండ్ లో ఓ రేంజులోనే జ‌రుపుకుంది ఈ గ్యాంగ్. స్పాట్ నుంచి మ‌లైకా-అర్జున్ జంట ర‌చ్చ.. అరోరా సిస్ట‌ర్స్ సంద‌డి బోలెడంత‌ వైర‌ల్ అయ్యింది. తాజాగా అమృతా అరోరా పుట్టినరోజు వేడుక‌లో స‌ద‌రు గాళ్స్ గ్యాంగ్ ర‌చ్చ ర‌చ్చ చేసింది.

అమృత ఈ రోజు తన 43 వ పుట్టినరోజు జరుపుకుంటున్న సంద‌ర్భంగా త‌న గ్యాంగ్ స‌భ్యుల‌కు అదిరిపోయే పార్టీని ఇచ్చింది. పార్టీలో మ‌లైకా అరోరా స‌హా బెబో క‌రీనా ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. ఇక‌పోతే క‌రీనా సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌నుండ‌గా.. ఇలా పార్టీల్లో ప్ర‌త్య‌క్ష‌మ‌వ్వ‌డం ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ గా మారింది. బెబో కాస్త ఓపిక ప‌డితే ముందు కూల్ గా బిడ్డ‌ను కనేశాక .. అటుపై తాపీగ్గా పార్టీల‌కు వెళ్లొచ్చు క‌దా! అంటూ యూత్ కామెంట్ల‌తో విరుచుకుప‌డుతున్నారు.

అయితే బెబో త‌న బేబి బంప్ తోనే క‌మ‌ర్షియ‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టించి .. షూటింగుల‌కు ఎటెండ‌వ్వడం ఇటీవ‌ల‌ షాకిచ్చింది... ఆ మాత్రం పార్టీ ఓ లెక్కా! అంటూ త‌న‌ని స‌మ‌ర్థించే అభిమానులు లేక‌పోలేదు. థైమూర్ అలీఖాన్ త‌ర్వాత‌ తన రెండవ బిడ్డను ఆశిస్తున్న కరీనా బ‌ర్త్ డే పార్టీలోకి వెళ్లేముందు కెమెరాలకు పోజులివ్వగా ఆ ఫోటోలు ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారాయి.