Begin typing your search above and press return to search.

బిపాసా జీవితంలో హేట్ స్టోరీ

By:  Tupaki Desk   |   5 Nov 2015 11:30 AM GMT
బిపాసా జీవితంలో హేట్ స్టోరీ
X
ఒక‌రి త‌ర్వాత ఒక‌రుగా బోయ్‌ ఫ్రెండ్స్‌ ని మార్చేయ‌డంలో న‌ల్ల‌క‌లువ బిపాసా స్పీడ్ గురించి ప్ర‌త్యేకించి వివ‌రించ‌న‌క్క‌ర్లేదు. కెరీర్ ఆరంభ‌మే టాప్ మోడ‌ల్ డినోమారియోతో ఎఫైర్ సాగించింది. అటుపై జాన్ అబ్ర‌హాం ..తో ఏకంగా 9 సంవ‌త్స‌రాలు స‌హ‌జీవ‌నం సాగించింది. ఆ తర్వాత జాన్‌ ని వ‌దిలేసి చాలా సంవ‌త్స‌రాలు సింగిల్‌ గానే ఉంది. ఇకపోతే గ‌తేడాది ఎలోన్ అనే హార‌ర్ చిత్రంతో అమ్మ‌డి జీవితంలో మ‌రో కొత్త అధ్యాయం మొద‌లైంది.

కొత్తలో ఈ చిత్ర హీరో క‌ర‌ణ్ సింగ్‌ గ్రోవర్‌ తో అంటీ ముట్ట‌న‌ట్టే ఉండేది. కాల‌క్ర‌మంలో క‌ర‌ణ్ గ్రోవ‌ర్‌ లో ఏం న‌చ్చిందో అత‌డితో మాటా మాటా క‌లిపేసి కార్‌ లో క‌లిసి ఇంటికెళ్లిపోవ‌డాలు, పార్టీల‌కు అటెండ్ కావ‌డాలు చేసింది. అక్క‌డినుంచి ఇద్ద‌రిమ‌ధ్యా ఏదేదో మొద‌లైంది బాలీవుడ్ మీడియాలో ప్ర‌చార‌మైంది. అయితే ఈ ఎఫైర్ కూడా ఎంతోకాలం నిల‌వ‌లేద‌న్న‌ది తాజా అప్‌ డేట్‌. క‌ర‌ణ్ సింగ్ గ్రోవ‌ర్‌ తో బిప్స్ ఎఫైర్‌ కి ఫుల్‌ స్టాప్ ప‌డింది. అయితే దానికి కార‌ణం యంగ్ హీరోయిన్ జరైన్ ఖాన్‌.

సల్మాన్ స‌ర‌స‌న వీర్ సినిమాతో వెండితెర‌కి ప‌రిచ‌యం అయిన జ‌రైన్‌ ఖాన్ ప్ర‌స్తుతం హేట్‌ స్టోరి 3లో క‌ర‌ణ్ స‌ర‌స‌న నాయిక‌గా న‌టించింది. ఈ సినిమా సెట్స్‌ లో ఉండ‌గానే క‌ర‌ణ్ పార్టీ మార్చాడు. బిప్స్‌ కి హ్యాండిచ్చి, జ‌రైన్‌ తో రొమాన్స్ మొద‌లుపెట్టాడు. ఇది న‌చ్చ‌కే బిప్స్ అత‌డిని కూడా విడిచిపెట్టింద‌ని చెబుతున్నారు. ఆ ర‌కంగా బిప్స్ జీవితం రియ‌ల్ హేట్‌ స్టోరిగా మారిపోయింద‌న్న‌మాట‌! ప్చ్‌!!