Begin typing your search above and press return to search.

కాఫీ విత్ కరణ్.. కాస్ట్ లీ గిఫ్టులే అందుకున్నారు..

By:  Tupaki Desk   |   17 Oct 2022 10:35 AM GMT
కాఫీ విత్ కరణ్.. కాస్ట్ లీ గిఫ్టులే అందుకున్నారు..
X
దేశ‌వ్యాప్తంగా అలాగే వ‌ర‌ల్డ్ వైడ్ ఇండియ‌న్ డ‌యాస్పోరాలో ఎక్కువ మంది వీక్షించిన షోలలో 'కాఫీ విత్ కరణ్' ఒకటి. ద‌ర్శ‌క‌నిర్మాత కరణ్ జోహార్ దీనికి హోస్ట్ గా వ్యవహరించ‌డ‌మే గాక ఆయ‌న‌ పరిశ్రమలోని ప్రముఖులను ఇంట‌ర్వ్యూలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇది 7 సీజన్ లను పూర్తి చేసుకుంది. సీజ‌న్ 7 నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో పెద్ద స‌క్సెసైంది. అయితే వీక్ష‌కులంద‌రినీ ఆకర్షిస్తున్నది 'కాఫీ విత్ కరణ్ హాంపర్'. బాక్స్ లో ఏముందో తెలుసుకోవడానికి అభిమానులు మొత్తం సీజన్ కోసం వేచి ఉన్నారు!

ఇంత‌లోనే కరణ్ జోహార్ అస‌లు విష‌యం వెల్లడించాడు. షో సంప్రదాయం ప్రకారం.. హోస్ట్ కరణ్ జోహార్ కాఫీ విత్ కరణ్ సీజన్ 7 లో విలాసవంతమైన హాంపర్ లో ఏం ఉందో అస‌లు విషయాలను ఆవిష్కరించారు.

సీజన్ 7 రాపిడ్-ఫైర్ రౌండ్ లో హాంపర్ విజేతలు ఇంటికి తీసుకెళ్లిన ఉత్పత్తుల జాబితా ప‌రిశీలిస్తే.. తయానీ జ్యువెలరీ- మార్షల్ ఆక్టన్ II స్పీకర్లు- ఆడి ఎస్ప్రెస్సో మొబైల్- అమెజాన్ ఎకో షో 10- వహ్డమ్ టీ -టీ మేకర్ సెట్- న్యూహాస్ చాక్లెట్స్ కలెక్షన్- డిస్కవరీ బాక్స్,-బాంబే స్వీట్ షాప్- ఖోయా స్వీట్- 28 బేకర్ స్ట్రీట్- కాఫీ విత్ కరణ్ మగ్ ఇంకా మరెన్నో విలాసవంతమైన వస్తువులు ఈ హాంప‌ర్ల‌లో ఉన్నాయి.

కాఫీ విత్ కరణ్ తాజా షో సెలబ్రిటీల గాసిప్ ల నుండి వివాదాల వరకు ఎన్నో మరపురాని విష‌యాల‌ను అందించింది. ఈసారి ఈ షోలో గౌరీ ఖాన్ -భావన పాండే- మహీప్ కపూర్‌లతో కలిసి కనిపించడం చర్చనీయాంశమైంది. చాలా గ్యాప్ తర్వాత ఖాన్ వైఫ్ ఇలా ఓటీటీ షోలోకి వచ్చింది.

కరణ్ జోహార్ నెక్స్ట్ ఏంటి?

చాలా గ్యాప్ తర్వాత క‌ర‌ణ్ ద‌ర్శ‌కుడిగా బిజీ అవుతున్నాడు. 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ' చిత్రానికి అతడు దర్శకత్వం వహిస్తున్నాడు.. ఈ చిత్రంలో అలియా భట్- రణవీర్ సింగ్- ధర్మేంద్ర- జయా బచ్చన్- షబానా అజ్మీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

రీసెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసి సోషల్ మీడియాలో ప్ర‌క‌టించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త‌ద‌ప‌రి ప‌లు భారీ ప్రాజెక్టుల‌ను నిర్మించేందుకు ప్లాన్ లో ఉన్నాడు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.