Begin typing your search above and press return to search.

క‌ర‌ణ్ ఈ ట్యాలెంటెడ్ న‌టిని రిజెక్ట్ చేశాడట‌

By:  Tupaki Desk   |   30 Aug 2022 3:38 AM GMT
క‌ర‌ణ్ ఈ ట్యాలెంటెడ్ న‌టిని రిజెక్ట్ చేశాడట‌
X
కరణ్ జోహార్ 'కాఫీ విత్ కరణ్ సీజన్ 7' అద్భుత వీక్ష‌ణ‌ల‌తో ఘ‌న‌విజ‌యం అందుకుంది. ఎనిమిది ఎపిసోడ్లు అద్భుతంగా అల‌రించాయి. ఇంత‌కుముందే క‌ర‌ణ్ రికార్డ్ వ్యూస్ గురించి ప్ర‌స్థావిస్తూ ఆనందం వ్య‌క్తం చేశారు. ఈ సీజ‌న్ లో ఇత‌ర ఎపిసోడ్స్ కంటే తాజాగా రిలీజ్ చేసిన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తోంది. తాజా ఎపిసోడ్ లో 'హీరోపంథి' జోడీ టైగర్ ష్రాఫ్- కృతి సనన్ .. హోస్ట్ కరణ్ తో సంద‌డి చేశారు.

తాజా షోలో అందాల న‌టి కృతి సనన్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. కృతిని క‌ర‌ణ్ ఊహించ‌ని ప్ర‌శ్న అడిగాడు. కొంత ఇబ్బంది ప‌డినా కానీ కృతి ర‌హ‌స్యాల‌ను దాచుకోకుండా ఓపెనైంది. హీరోపంథి కంటే ముందు మీరు చాలా ఆడిషన్ ల‌లో రిజెక్ట్ అయ్యారా? అని క‌ర‌ణ్ ప్ర‌శ్నించ‌గా..''నా మొదటి ఆడిషన్ నిజానికి స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 1 కోసమేనని మీకు తెలుసా?'' అంటూ కృతి వెంట‌నే స‌మాధాన‌మిచ్చింది.

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రానికి సంబంధించిన ఆడిషన్స్ లో కృతి సనన్ ని తిరస్కరించిన వ్యక్తి (క‌ర‌ణ్ - పునీత్ మ‌ల్హోత్రా ద‌ర్శ‌కులు).. ఆ మూవీకి దర్శకుడు కావడంతో కరణ్ జోహార్ 'అయ్యో!' అని ఛ‌మ‌త్కారంగా అన్నాడు.

అలాగే నెట్ ఫ్లిక్స్ లస్ట్ స్టోరీస్ ఆఫర్ ను కోల్పోవడం గురించి కృతి వెల్లడించడం తన తల్లికి ఇష్టం లేద‌ని కూడా కృతి చెప్పింది. హీరోపంథితో కృతి బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రానికి కృతిని రిజెక్ట్ చేసి అలియా భట్ ని క‌ర‌ణ్ బృందం ఎంపిక చేసుకున్నారు. వరుణ్ ధావన్ - సిద్ధార్థ్ మల్హోత్రా ఈ చిత్రంతో హీరోలుగా తెరంగేట్రం చేసారు.

కృతి స‌నోన్ ఇంత‌కుముందు మహేష్ స‌ర‌స‌న 1 - నేనొక్క‌డినే లాంటి భారీ చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఈ చిత్రానికి సుకుమార్ వంద‌లాది మంది నాయిక‌ల‌ను ఆడిష‌న్స్ చేసి చివ‌రికి కృతిని ఫైన‌ల్ చేశారు. కానీ కృతి స‌నోన్ లుక్ చూసి మ‌హేష్ అభిమానులు తీవ్ర నిరాశ‌కు గుర‌య్యారు. కానీ కృతి సెలెక్ష‌న్ త‌ప్పు కాద‌ని మూవీ చూశాక అభిమానులు స‌హా క్రిటిక్స్ కూడా ప్ర‌శంసించారు.

అంత గొప్ప‌గా న‌టిస్తుంది గ‌నుకే ఇంత పెద్ద కాంపిటీష‌న్ లో కూడా కృతి దూసుకుపోతోంది. నాగ‌చైత‌న్య స‌ర‌స‌న దోచేయ్ లోనూ కృతి న‌టించింది. కానీ ఆ రెండు సినిమాలు ఫ్లాపులుగా నిల‌వ‌డంతో తిరిగి హిందీలోనే కృతి న‌టిస్తోంది. ఇటీవ‌ల పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న భారీ చిత్రం ఆదిపురుష్ 3డిలో అత్యంత కీల‌క‌మైన‌ సీత పాత్ర‌లో అవ‌కాశం ద‌క్కించుకుంది ఈ ల‌క్కీ గాళ్.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.