Begin typing your search above and press return to search.

స్టార్‌ హీరోలతో గే లవ్‌ స్టోరీ మూవీ

By:  Tupaki Desk   |   26 Jan 2019 7:15 AM GMT
స్టార్‌ హీరోలతో గే లవ్‌ స్టోరీ మూవీ
X
బాలీవుడ్‌ స్టార్‌ ఫిల్మ్‌ మేకర్‌ కరణ్‌ జోహార్‌ ఏ సినిమా చేసినా కూడా ప్రేక్షకుల అంచనాలు భారీగా ఉంటాయి. పూర్తి కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ తో ఈయన సినిమా ఉంటుంది. యూత్‌ ఆడియన్స్‌ ను టార్గెట్‌ చేసేలా, కథలను ఎంపిక చేసుకోవడంతో పాటు, రెగ్యులర్‌ కు కాస్త భిన్నంగా అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ ఉంటాడు. నిర్మాతగా, దర్శకుడిగా ఎన్నో సినిమాలను చేసిన కరణ్‌ జోహార్‌ త్వరలోనే ఒక గే లవ్‌ స్టోరీతో సినిమాను చేయబోతున్నట్లుగా ప్రకటించాడు.

తాజాగా దావోస్‌ లో జరిగిన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సుకు హాజరైన కరణ్‌ జోహార్‌ ఇండియాలో సినీ పరిశ్రమ పరిస్థితి, వ్యాపారంపై ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పేర్కొన్నాడు. ఇండియన్‌ సినిమా స్థాయి చాలా పెరిగిందని, ప్రతి సంవత్సరం వేల కోట్ల వ్యాపారం జరుగుతుందని పేర్కొన్నాడు. ఇక ప్రస్తుతం తాను నిర్మిస్తున్న మల్టీస్టారర్‌ చిత్రం 'తఖ్త్‌' తర్వాత ఒక గే లవ్‌ స్టోరీతో సినిమాను చేస్తానంటూ ప్రకటించాడు.

బాలీవుడ్‌ ఇద్దరు స్టార్‌ హీరోలతో గే స్టోరీని నిర్మించబోతున్నట్లుగా కూడా చెప్పుకొచ్చాడు. గతంలో వచ్చిన దోస్తాన చిత్రం అందరిని అలరించి, ఎంటర్‌ టైన్‌ చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడు గే లవ్‌ స్టోరీతో ఇద్దరు స్టార్‌ హీరోలతో కరణ్‌ జోహార్‌ సినిమా చేయబోతున్న నేపథ్యంలో అంచనాలు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గే లవ్‌ స్టోరీ అంటే ఎమోషన్‌ తో పాటు, ఎంటర్‌ టైన్‌ మెంట్‌ కూడా మస్త్‌ గా ఉండే అవకాశం ఉంది. సమ్మర్‌ తర్వాత ఆ సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.