Begin typing your search above and press return to search.

ఏకంగా బాలీవుడ్ చీక‌టి కోణంపై వెబ్ సిరీస్

By:  Tupaki Desk   |   11 Sept 2022 11:53 AM IST
ఏకంగా బాలీవుడ్ చీక‌టి కోణంపై వెబ్ సిరీస్
X
ఓటీటీ ప్ర‌పంచంలో ప్ర‌యోగాలు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి. రెగ్యుల‌ర్ థియేట్రిక‌ల్ స్క్రీన్ పై చెప్ప‌లేని ఎన్నో క‌థ‌లను ఓటీటీలో చెబుతున్నారు. ప్రముఖ OTT ప్లాట్ ఫారమ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తమ కొత్త షోలను డిస్నీ ఫ్యాన్ ఈవెంట్ - D23 ఎక్స్‌పోలో ప్రకటించింది. ఇందులో భాగంగా ఇప్పుడు `షో టైమ్` పేరుతో సరికొత్త వెబ్ సిరీస్ తో రాబోతోంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత -దర్శకుడు కరణ్ జోహార్ స‌మర్ప‌ణ‌లో ఇది తెర‌కెక్క‌నుంది.

ఈ షో క‌థాంశం ర‌క్తి క‌ట్టించ‌నుంది. ఇది `బాలీవుడ్ పరిశ్రమ` పై క‌థాంశం. సినిమాని నడిపించే శక్తి కోసం ఆఫ్ ది స్క్రీన్ పోరాటాలు ఎలా సాగుతాయో క‌ళ్ల‌కు గ‌ట్టే ప్ర‌య‌త్న‌మిద‌ని తెలిసింది. ఈ షోలో బాలీవుడ్ ఇండస్ట్రీ ట్రేడ్ సీక్రెట్స్ ను కూడా బయటపెట్టే అవకాశం ఉంది. సినీ పరిశ్రమ నేపథ్యంలో సాగే ఈ సిరీస్ ను కరణ్ జోహార్- అపూర్వ మెహతా- సోహెన్ మిశ్రా నిర్మించనున్నారు. నటీనటులు -సిబ్బందికి సంబంధించిన ఇతర వివరాలను టీమ్ ఇంకా ప్రకటించాల్సి ఉంది. అలాగే ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని ఇంకా లాక్ చేయ‌లేదు.

పైర‌సీ మాఫియాపైనా ఓటీటీ సినిమా

త‌మిళ రాక‌ర్స్ పైర‌సీ మాఫియా ఆరాచ‌కాలపైనా ఓటీటీ సినిమా తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. సినిమా విడుద‌లైన మార్నింగ్ షోకే త‌మిళ రాక‌ర్జ్ వెబ్ సైట్ లో లైవ్ చూపిస్తామ‌ని బెదిరించే గ్యాంగ్ పై సినిమా ఇది. ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో వ‌ర‌ల్డ్ ప్రీమియ‌ర్ బై త‌మిళ్ రాక‌ర్స్ అని నేరుగా పోలీసుల‌ను సైబ‌ర్ క్రైమ్ బ్రాంచీనే బెదిరించే మాఫియా క‌థాంశాన్ని తెర‌కెక్కించారు. తమిళ్ రాకర్స్ పైరేట్ వెబ్ సైట్ ఈ మధ్యకాలంలో దక్షిణ భారత సినిమాలకు అత్యంత ప్రమాదకరమైన ముప్పుగా మారింది. సినిమా ఏదైనా కానీ విడుదలైన కొన్ని గంటల తర్వాత తమిళ్ రాకర్స్ లో డౌన్ లోడింగుకి అందుబాటులో ఉంటుంది. కొన్ని సినిమాలు విడుదలకు కొన్ని గంటల ముందే వెబ్ సైట్ లోకి వచ్చేసిన సంద్భాలున్నాయి. త‌మిళ రాక‌ర్స్ పైరేట్ టీమ్ నెట్ వర్క్ అతి పెద్దది. వ‌ర‌ల్డ్ వైడ్ విస్త‌రించి ఉంది. అందుకే తమిళ్ రాకర్స్ కథాంశంతో ఓ వెబ్ సిరీస్ రూపొందించి విడుద‌ల చేయ‌డం ఉత్కంఠ రేపింది.

తమిళ్ రాకర్జ్ అనే టైటిల్ తో రూపొందిన ఈ సిరీస్ లో అరుణ్ విజయ్ పోలీసాఫీస‌ర్ గా న‌టించారు. వాణీ భోజన్- ఐశ్వర్యా మీనన్ త‌దిత‌రులు ప్రధాన పాత్రలు పోషించారు. దీనికి అరివళగన్ దర్శకత్వం వహించ‌గా ఈ సిరీస్ ను లెజెండరీ ప్రొడక్షన్ హౌస్ ఏవీఎం ప్రొడక్షన్స్ నిర్మించింది. ఇటీవ‌లే ఈ సినిమా ఓటీటీలో విడుద‌లై ప్ర‌శంస‌లు అందుకుంది. ఐఎండీబీలో 5.5 రేటింగుని ఇచ్చారు.