Begin typing your search above and press return to search.
కరణ్ .. ఈ కష్ట కాలంలో 3 రోజుల పెళ్లిలా 3 రోజుల పుట్టినరోజు వేడుకలా?
By: Tupaki Desk | 24 May 2021 6:00 PM ISTCOVID 19 సెకండ్ వేవ్ కల్లోలంతో గ్లామర్ పరిశ్రమకు సినిమా ప్రీమియర్లలో లేదా ఉన్నత స్థాయి సామాజిక సమావేశాలలో సోదరభావం(సాటి సెలబ్రిటీలతో మీట్ అండ్ గ్రీట్ పార్టీలు) పొందే అవకాశం లేదు. జనవరిలో వరుణ్ ధావన్ - నటాషా దలాల్ స్టార్-స్టడెడ్ పెళ్లి తరవాత బాలీవుడ్లో పెద్ద ఈవెంట్ లేనే లేదు. ఎట్టకేలకు అలాంటి ఒక ఈవెంట్ కి సమయమాసన్నమైంది.
బాలీవుడ్ పూలరంగడిగా పాపులరైన కరణ్ జోహార్ తన 49 వ ఏట అడుగుపెట్టనున్నారు. ఈ మంగలశారం (మే 25) ఆయన బర్త్ డే పార్టీ కి రంగం సిద్ధమవుతోంది. సినిమా పరిభాషలో భారీ వేడుక ఖాయమేనని తెలుస్తోంది. ఈసారి బాంద్రాకు బదులుగా అలీబాగ్ లో వేడుకలు నిర్వహిస్తున్నారట. అతిథుల జాబితాలో రణబీర్ కపూర్ - అలియా భట్, రణవీర్ సింగ్ - దీపికా పదుకొనే,.. విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ.. కరీనా-సైప్ ఖాన్ .. షారూఖ్ ఖాన్ - గౌరీ ఖాన్... విక్కీ కౌషల్- కత్రినా కైఫ్.. వరుణ్ ధావన్-నటాషా..అభిషేక్ బచ్చన్- ఐశ్వర్య రాయ్ బచ్చన్.. మలైకా అరోరా- అర్జున్ కపూర్, ..అనన్య పాండే- ఇషాన్ ఖట్టర్, రాణి ముఖర్జీ- ఆదిత్య చోప్రా జంటలు ఉన్నాయి.
ఈ సంవత్సరంలో అత్యంత స్టార్-స్టడెడ్ గెస్ట్ జాబితా చాలా పెద్దదే. మనీష్ మల్హోత్రా,- కృతి సనోన్, -నేహా ధూపియా, -అంగద్ బేడి, జాన్వి కపూర్, ఖుషి కపూర్,- ఆదిత్య రాయ్ కపూర్, -మహీప్ కపూర్- భావ్నా పాండే, - సీమా ఖాన్,- నీలం, -జోయా అక్తర్ తదితర ప్రముఖులందరికీ అలీబాగ్ చేరుకోవడానికి ఆహ్వానాలు పంపారు.
కరణ్ జోహార్ బాలీవుడ్ సెలబ్రిటీలకు అత్యంత ప్రియమైన వ్యక్తి. COVID 19 విస్త్రతి దృష్ట్యా ఈసారి పుట్టినరోజు వేడుకలను మే 24 మే 25 మే 26 తేదీలలో మూడు రోజుల ఫెస్టివల్ గా మార్చారు. ఈ వ్యవహారాన్ని రద్దీగా ఉంచకూడదని అతిథుల సంఖ్యను విభజించారు.
వారిలో కొందరు 23 నుండి రావడం ప్రారంభిస్తారు. కొందరు ఎ-లిస్టర్లు రిస్క్ చేయకూడదని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. రణ్‌వీర్ - దీపిక,.. కరీనా - సైఫ్,.. రాణి ముఖర్జీ - ఆదిత్య చోప్రా & అనుష్క శర్మ - విరాట్ కోహ్లీతో సహా పలువురు ఈ వేడుకలకు వస్తారా లేదా? అన్నది ఇంకా చెప్పలేం అని తెలిసింది.
సెకండ్ వేవ్ కల్లోలం కొనసాగుతున్నా కరణ్ దానిని కేర్ చేయక ఇలా చేయడంపై విమర్శలు వెల్లువెత్తే అవకాశం లేకపోలేదు. బాలీవుడ్ పార్టీ కల్చర్ కి కరోనా రెయిన్ చెక్ పెట్టలేకపోతోందన్న గుసగుసలు కామన్ గా వినిపిస్తాయనడంలో సందేహమేం లేదు. మరోవైపు పార్టీల్లో డ్రగ్ కల్చర్ గురించి ఇటీవల సుశాంత్ సింగ్ మరణానంతరం విస్త్రతంగా చర్చ సాగింది. ఈ కేసుల్లో కరణ్ జోహార్ పేరు ప్రముఖంగా వినిపించింది. అయినా కానీ ఆయన మళ్లీ అదే రిపీట్ చేస్తున్నారు. 3 రోజుల పుట్టినరోజు వేడుకలు అంటూ గడబిడ దేనికి? అన్నది కాస్త వేచి చూడాలి.