Begin typing your search above and press return to search.

సినిమా చూసి ఏమీ చెప్పకండి ప్లీజ్

By:  Tupaki Desk   |   30 Oct 2017 5:25 PM IST
సినిమా చూసి ఏమీ చెప్పకండి ప్లీజ్
X
ఈ రోజుల్లో కొన్ని సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నాయంటే ఒక్కరికి నచ్చకుంటే చాలు ఓ పదిమందికి చేప్పేస్తున్నారు. వారికి నచ్చకుంటే ఎదుటివాడు అసలు సినిమా చూడకూడదు అనే భావనను కలిగించేలా ట్రిక్కుల మాటలు ఉపయోగిస్తున్నారు. దీంతో సినిమాల రిజల్ట్ కి ఎంతో కొంతే ఎఫెక్ట్ పడక తప్పట్లేదు. ముఖ్యంగా సోషల్ మీడియాలో కూడా యాంటీ ఫ్యాన్స్ ఎక్కువవుతుండడడంతో సినిమాలపై ప్రభావం పడుతోంది.

సినిమా విడుదలైన రెండు రోజులకే కలెక్షన్స్ పై ఆ విధమైన ప్రభావం పడటంతో కొన్ని మంచి సినిమాలు కూడా తీవ్రంగా నష్టపోతున్నాయి. రివ్యూలు కూడా సినిమా కలెక్షన్స్ ని దెబ్బతీస్తోందని ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు కామెంట్ చేశారు. బాలీవుడ్ లో కూడా ఇప్పుడు అదే తరహాలో కొంత మంది ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రముఖ నిర్మాత దర్శకుడు కరణ్ జోహార్ అయితే వేడుకుంటున్నాడు తెలుసా. షారుక్ ఖాన్ తో కలిసి ఆయన నిర్మించిన ఇట్టేఫక్ సినిమా నవంబర్ 3న రిలీజ్ కానుంది.

అయిత్ కరణ్ జోహార్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు. సినిమాను చూసి ఏమి చెప్పకండి ప్లీజ్ అంటూ.. వేడుకున్నారు. ఇది చాలా మంచి సినిమా అని అందరికి నచ్చుతుందని కూడా ఆయన తెలిపారు. అభయ్ చోప్రా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సిద్దార్థ్ మల్హోత్రా - అక్షయ్ ఖన్నా - అలాగే సోనాక్షి సిన్హా నటిస్తోన్నారు.