Begin typing your search above and press return to search.
టాలీవుడ్ మాస్ కు అందుకే అంత గిరాకీ
By: Tupaki Desk | 27 Nov 2018 7:00 AM ISTగత కొన్నేళ్లుగా తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్ వెర్షన్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడిన ట్రెండ్ ను చూస్తూనే ఉన్నాం. సరైనోడు ఏకంగా 200 మిలియన్ల వ్యూస్ తెచ్చుకుని రికార్డులు బద్దలుకొట్టడం చూసి అందరు ఔరా అనుకున్నారు. ఏవో సాంకేతిక కారణాల వల్ల దాన్ని డిలీట్ చేసి మళ్ళి రీ లోడ్ చేయాల్సి వచ్చినా అదే స్థాయిలో వ్యూస్ కొనసాగుతూనే ఉన్నాయి. హిట్టు ప్లాప్ అనే తేడా లేకుండా మసాలా అంశాలకు కొదవ లేకుండా ఉండే సౌత్ సినిమాలకు ఆన్ లైన్ లో బ్రహ్మాండమైన ఆదరణ దక్కుతోంది.
దీని గురించి కరణ్ జోహార్ చాలా స్పష్టమైన విశ్లేషణ చేస్తున్నారు. హిందీలో మాస్ మసాలా సినిమాలు తీసే దర్శకులు ఇప్పుడు ఎవరూ లేరని అందరు ప్రయోగాలను ప్రోత్సహిస్తుండటంతో సక్సెస్ శాతం తక్కువగా ఉన్న స్టార్ హీరోలు సైతం వాటికే మొగ్గు చూపుతున్నారని క్లారిటీ ఇచ్చాడు. అందుకే తెలుగు నుంచి వచ్చే స్టార్ హీరోల మాస్ సినిమాలకు ఇంత భారీ రెస్పాన్స్ దక్కుతోందని చెప్పాడు. బాలీవుడ్ లో మాస్ సినిమాలు లేని కొరతను ఇవి తీర్చడం వల్లే సౌత్ హీరోలకు గుర్తింపు వస్తోందని చెప్పాడు. కరణ్ చెప్పిన వెర్షన్ వాస్తవమే.
సోనీ మ్యాక్స్ లాంటి ఛానల్స్ కేవలం తెలుగు తమిళ డబ్బింగ్ సినిమాలతో తమ రేటింగ్స్ ని కాపాడుకుంటూ ఉనికిని చాటుకుంటున్నాయి. రోజుకు కనీసం రెండైనా తెలుగు సినిమాల డబ్బింగ్స్ లేకుండా రోజు గడవని హిందీ హిందీ ఛానల్స్ చాలానే ఉన్నాయి. ఇక యుట్యూబ్ సంగతి సరేసరి. ఒరిజినల్ స్ట్రెయిట్ హిందీ మూవీస్ కన్నా మన డబ్బింగ్ మాస్ సినిమాలు చూసేందుకే నార్త్ ప్రేక్షకులు ఎగబడుతున్నారు. గోల్డ్ మైన్స్ అనే యుట్యూబ్ ఛానల్ కేవలం వీటి మీదే వేల మిలియన్ల వ్యూస్ దక్కించుకుని హక్కుల కోసం కోట్ల రూపాయల పెట్టుబడికి సైతం సై అంటోంది. తెలుగు సినిమా మాస్ పవర్ అంటే అదే మరి