Begin typing your search above and press return to search.

బాలీవుడ్ లో మ‌న సినిమా గెలిచింది ఎవ‌రి వ‌ల్ల‌?

By:  Tupaki Desk   |   18 May 2022 6:00 AM IST
బాలీవుడ్ లో మ‌న సినిమా గెలిచింది ఎవ‌రి వ‌ల్ల‌?
X
బాలీవుడ్ లో మ‌న సినిమాలకు ఇప్పుడు తిరుగులేదు. డ‌బ్బింగ్ సినిమా అయినా స‌రే అక్క‌డ మ‌న సినిమా రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌డుతూ సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. స్ట్రెయిట్ సినిమాని మించి బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది. కోట్లు కొల్ల‌గొడుతోంది. మ‌న సినిమాల ధాటికి బాలీవుడ్ సినిమాలు తేలిపోతూ చేతులు ఎత్తేస్తున్నాయి. అయితే ఇది నేటి మాట‌. మ‌న సినిమా `బాహుబ‌లి` నుంచి బాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద విజ‌య‌దుందుభి మోగించ‌డం మొద‌లు పెట్టింద‌న్న విష‌యం అంద‌రికి తెలిసిందే.

అయితే ఇలా మ‌న సినిమాకు అక్క‌డ మంచి స‌పోర్ట్ గా నిలిచింది ఎవ‌రు?.. మ‌న సినిమాని అక్క‌డ ముందు గెలిపించింది ఎవ‌రు అన్న‌ది చాలా మందికి తెలియ‌దు. `బాహుబ‌లి`ని పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిల‌పాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అక్క‌డ ఎవ‌రిని ప‌ట్టుకుంటే బాగుంటుందో వాళ్ల‌ని ప‌ట్టుకున్నారు. అత‌నే క‌ర‌ణ్ జోహార్‌. అత‌ని వ‌ళ్లే బాహుబ‌లి హ్యూజ్ గా ఉత్త‌రాది మార్కెట్ లోకి చోచ్చుకుని వెళ్లింది.. అక్క‌డి ప్రేక్ష‌కుల‌కు చేరువైంది.

అయితే అత‌న్ని రాజ‌మౌళికి, బాహుబ‌లి మేక‌ర్స్ కి ప‌రిచ‌యం చేసిన ఘ‌న‌త మాత్రం టాలీవుడ్ మాచో మ్యాన్ ద‌గ్గుబాటి రానాదే. అప్ప‌టికే బాలీవుడ్ లో వ‌రుస సినిమాలు చేస్తూ అక్క‌డ మంచి ప‌రిచ‌యాలు, మార్కెట్ ని క్రియేట్ చేసుకున్న రానా త‌ను `బాహుబ‌లి`లో న‌టించ‌డం వ‌ల్ల ఆ బాధ్య‌త‌ని త‌న నెత్తిన వేసుకుని రాజ‌మౌళికి, మేక‌ర్స్ కి క‌ర‌ణ్ జోహార్ ని ప‌రిచ‌యం చేశాడు. క‌రణ్ జోహార్ బాలీవుడ్ లో `బాహుబ‌లి`కి అండ‌గా నిల‌వ‌డంతో అక్క‌డి నుంచే మ‌న సినిమాల‌కు మంచి దారి ఏర్ప‌డింది.

ఇప్పుడు అక్క‌డ తెలుగు సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్ముదులుపుతోందంటే దానికి ముందు స‌పోర్ట్ గా నిలిచింది క‌ర‌ణ్ జోహార్ అని చెప్ప‌క‌త‌ప్ప‌దు. అఫ్ కోర్స్ త‌ను ముందుకు రాక‌పోయి వుంటే ఫ‌ర్హాన్ అక్త‌ర్ లేదా మ‌రోక‌రు ముందుకొచ్చేవారు. కానీ క‌ర‌ణ్ జోహార్ అంత స‌పోర్ట్ అయితే ల‌భించి వుండేది కాదు. ఇక `బాహుబ‌లి`కి స‌పోర్ట్ చేయ‌డం క‌ర‌ణ్ కు అవ‌సరం, అత‌ని అవ‌స‌రం రాజ‌మౌళికి వుంది ఇలా ప‌ర‌స్ప‌రం ఒక‌రి అవ‌స‌రం ఒక‌రికి వుంది కాబ‌ట్టే రాజ‌మౌళికి అండ‌గా క‌రణ్ నిలిచారు.

ఆ అడుగే ఇప్ప‌డు ద‌క్షిణాది సినిమా బాలీవుడ్ లో ప్ర‌భంజ‌నం సృష్టించ‌డానికి ప్ర‌ధాన బ‌లంగా నిలిచింది. ఆ అండ వ‌ల్లే బాహుబ‌లి నుంచి కేజీఎఫ్ 2 వ‌ర‌కు మ‌న ద‌క్షిణాది చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ బాలీవుడ్ లో బాక్సాఫీస్ ని ర‌ఫ్ఫాడించేస్తున్నాయి. అక్క‌డి సినిమాల‌నే వెన‌క్కి నెట్టి రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌డుతున్నాయి. ఇక‌పై ఇంత‌కు మించిన విజ‌యాల్ని కూడా సాధించి వ‌సూళ్ల సునామిని సృష్టిస్తాయి అన‌డంతో ఎలాంటి సందేహం లేదు.