Begin typing your search above and press return to search.

మరో వివాదంలో కరణ్ జోహార్..టైటిల్ లాగేసుకున్నాడని విమర్శలు!

By:  Tupaki Desk   |   23 Nov 2020 4:20 PM IST
మరో వివాదంలో కరణ్ జోహార్..టైటిల్ లాగేసుకున్నాడని విమర్శలు!
X
ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ వ్యవహారం ప్రస్తుతం ప్రతిదీ వివాదాస్పదంగా మారుతోంది. బాలీవుడ్ కు సంబంధించి ఏం గొడవ తలెత్తినా, ఏ వివాదం వచ్చినా కరణ్ జోహార్ గురించి వార్తలు వస్తున్నాయి. హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం, డ్రగ్స్ ఈ వ్యవహారానికి సంబంధించి ఆయనపై విమర్శల వర్షం కురిసింది. సుశాంత్ చావుకు నువ్వే కారణం అంటూ.. అటు అభిమానులు, నెటిజన్లు.. కరణ్ పై దుమ్మెత్తిపోశారు. కొత్తవాళ్లను ఎదగనీయకుండా కరణ్ జోహార్ అడ్డుపడుతున్నారని విమర్శలు చేశారు. సుశాంత్ మరణించిన తర్వాత వివాదాస్పద నటి కంగనా రనౌత్ ట్విట్టర్ వేదికగా కరణ్ జోహార్ పై విమర్శల దాడి చేశారు. ఆ సమయంలో కరణ్ జోహార్ సన్నిహితులు సుశాంత్ మరణంపై కరణ్ తీవ్ర విషాదంలో ఉన్నారని వివరించగా... ఆ మరుసటి రోజే జరిగిన బర్త్ డే వేడుకలో నవ్వుతూ గడిపిన కరణ్ ఫోటోలు బయటకు రావడంతో మరోసారి అతడిపై విమర్శల దాడి సాగింది.

ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆయన మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ప్రముఖ దర్శకుడు మధుర్ బండార్కర్ కూడా కరణ్ పై విమర్శలు చేశారు. తాను రిజిస్టర్ చేసుకున్న ఓ సినిమా టైటిల్ ని కరణ్ నైతికంగా వాడుకున్నారని తీవ్రంగా మండిపడ్డారు. తాను ' బాలీవుడ్ వైవ్స్ అనే పేరుతో సినిమా చేస్తున్నానని, ఇప్పటికే షూటింగ్ కూడా జరుగుతోందని చెప్పారు.

అయితే కరణ్ తాను రూపొందిస్తున్న వెబ్ సిరీస్ కి ఈ టైటిల్ సూట్ అవుతుందని, ఆ టైటిల్ తనకు ఇవ్వాలని కరణ్ మొదట తనను అడిగాడని, అందుకు తాను తిరస్కరించినట్లు చెప్పారు. అయితే కరణ్ తన టైటిల్ ని వెబ్ సిరీస్ కు వాడే చేసుకున్నారని, 'ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్ ' అని టైటిల్ పెట్టుకున్నారని విమర్శించారు. తాను రిజిస్టర్ చేసుకున్న టైటిల్ని ఆయన వాడుకోవడం ఏ విధంగా సబబు' అని మధుర్ ప్రశ్నించారు.