Begin typing your search above and press return to search.

కరణ్ పార్టీలో కనిపించని బాహుబలి - RRR స్టార్స్..!

By:  Tupaki Desk   |   26 May 2022 8:47 PM IST
కరణ్ పార్టీలో కనిపించని బాహుబలి - RRR స్టార్స్..!
X
ప్రముఖ బాలీవుడ్‌ దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌ బుధవారం (మే 25న) తన 50వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సెలబ్రిటీలకు ముంబైలో గ్రాండ్‌ గా పార్టీ ఏర్పాటు చేశారు. దీనికి బాలీవుడ్‌ సినీ ప్రముఖులంతా హాజరవ్వగా.. పలువురు సౌత్ సెలబ్రిటీలు కూడా హాజరై కరణ్ కు శుభాకాంక్షలు తెలియజేసారు.

కరణ్ జోహార్ కు టాలీవుడ్ లో చాలామందితో సాన్నిహిత్యం ఉండటంతో.. మన స్టార్స్ అంతా పార్టీకి వెళ్తారని అందరూ భావించారు. కానీ ఆశ్చర్యంగా అక్కడ ఎవరూ కనిపించలేదు. కరణ్ తో కలిసి 'లైగర్' సినిమా చేస్తున్న హీరో విజయ్ దేవరకొండ - డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ - నిర్మాత చార్మీ కౌర్‌ ఈ పార్టీకి అటెండ్ అయ్యారు.

అలానే దక్షిణాది చిత్రాల్లో నటిస్తోన్న తమన్నా భాటియా - పూజా హెగ్డే - రష్మిక మందన్నా - రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ లు కూడా హాజరయ్యారు. అయితే రాజమౌళి - ప్రభాస్ - ఎన్టీఆర్ - రామ్ చరణ్ - రానా దగ్గుబాటి వంటి టాలీవుడ్ ప్రముఖులు కరణ్ జోహార్ పార్టీలో కనిపించకపోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

'బాహుబలి' ప్రాంఛైజీని హిందీలో రిలీజ్ చేసిన కరణ్ జోహార్.. RRR స్టార్స్ తో కూడా సాన్నిహిత్యం కలిగి ఉన్నారు. అలాంటిది వారు ఈ పార్టీలో లేకపోవడానికి కారణం ఆహ్వానం అందకపోవడమే అని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.

అయితే కరణ్ కొన్ని కారణాల వల్ల చాలా మంది ప్రముఖులను పార్టీకి ఆహ్వానించలేదనే టాక్ కూడా వస్తోంది. బాలీవుడ్ ప్రముఖులను మరియు ప్రస్తుతం తనతో వర్క్ చేస్తున్న నటీనటులు - దర్శకులని మాత్రమే కరణ్ ఇన్వైట్ చేసారని అంటున్నారు.

మరి నిజంగానే కరణ్ నుంచి బాహుబలి & RRR స్టార్లకు ఆహ్వానం అందలేదా? అందినా ఇతర పనుల్లో బిజీగా ఉండటం వల్ల వెళ్లలేదా? అనేది తెలియాల్సి ఉంది.

ఇకపోతే కరణ్ పార్టీకి బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి షారుక్‌ ఖాన్‌ కుటుంబంతో హాజరయ్యారు. అమీరా ఖాన్ తన మాజీ భార్య కిరణ్ రావుతో కలిసి వచ్చాడు. కొత్త జంటలు కత్రీనా కైఫ్‌-విక్కీ కౌశల్‌.. రణ్‌ బీర్‌-ఆలియా భట్‌ లు సందడి చేశారు. అలాగే హృతిక్‌ రోషన్‌ తన రూమర్డ్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ సబా అజాద్‌ తో వచ్చాడు.

ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్ దంపతులు.. సైఫ్ అలీఖాన్-కరీనా దంపతులు కూడా హాజరయ్యారు. సల్మాన్ ఖాన్ - రణ్వీర్ సింగ్ - మాధురీ దీక్షిత్ - రాణీ ముఖర్జీ - షాహీద్ కపూర్ - అనుష్క శర్మ - మలైకా అరోరా - సారా అలీఖాన్ - అనన్య పాండే - జాన్వీ కపూర్ తదితరులు కరణ్ జోహార్ పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యారు.