Begin typing your search above and press return to search.
జెర్సీ బాలీవుడ్ రీమేక్ ఆయన ఖాతాలో
By: Tupaki Desk | 25 Jun 2019 10:08 AM ISTఎంచుకున్న కథలో కొత్తదనం.. ఎమోషన్ సరిగ్గా కుదిరితే ఆ సినిమా గ్యారెంటీగా విజయం సాధిస్తుందనడానికి `జెర్సీ` పెర్ ఫెక్ట్ ఎగ్జాంపుల్. క్రీడా నేపథ్యంతో ఆద్యంతం రక్తి కట్టించే కథనంతో తీర్చిదిద్దిన చిత్రమిది. క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ చిత్రంలో నాని కథానాయకుడిగా నటించారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. గ్యారెంటీ హిట్ కొడతానని చెప్పి మరీ నాని జెర్సీతో విజయం అందుకున్నాడు. ఆరంభం డివైడ్ టాక్ వచ్చినా ఒడిదుడుకుల్ని తట్టుకుని లాంగ్ డ్రైవ్ లో పెట్టుబడుల్ని రికవరీ చేయగలగింది. ఇక ఈ చిత్రంలో నాని నటన.. గౌతమ్ దర్శకత్వ ప్రతిభకు క్రిటిక్స్ నుంచి ప్రశంసలు కురిసాయి.
ఇకపోతే జెర్సీ తరహా కథాంశాలకు ఉత్తరాది ఆడియెన్ లో ఆదరణ ఉంటుందనడంలో సందేహం లేదు. కొత్తదనం.. ప్రయోగాత్మకతకు పట్టంగడతారక్కడ. అందుకే ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ ని చేజిక్కించుకున్నారు. హిందీ వెర్షన్ కి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. నేచురల్ స్టార్ నాని పోషించిన పాత్రలో బాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో షాహిద్ కపూర్ నటిస్తారట. అయితే ఈ రీమేక్ కి సంబంధించిన అధికారిక సమాచారం వెల్లడి కావాల్సి ఉంది.
జెర్సీ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగ వంశీ నిర్మించిన సంగతి తెలిసిందే. రీమేక్ రైట్స్ కి సంబంధించిన అధికారిక వివరాలు నిర్మాతలే చెబుతారేమో చూడాలి. మరోవైపు జెర్సీ చిత్రాన్ని చైనాలోనూ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దానికి సంబంధించిన అప్ డేట్ తెలియాల్సి ఉందింకా.