Begin typing your search above and press return to search.

ఫ్రెష్ రూమర్: బాహుబలిలో ఈమె కూడా

By:  Tupaki Desk   |   30 Oct 2015 1:05 PM GMT
ఫ్రెష్ రూమర్: బాహుబలిలో ఈమె కూడా
X
బాహుబలి ది కంక్లూజన్ డిసెంబర్ నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తి చేస్తోంది యూనిట్. అయితే.. ఈ మూవీలో వాళ్లు నటిస్తున్నారు, వీళ్లు నటిస్తున్నారంటూ చాలామంది పేర్లు తెరపైకొస్తున్నాయి. ఇఫ్పటివరకూ ఎవరూ ఈ స్పెషల్ రోల్స్ పై నోరు మెదపకపోయినా.. రూమర్స్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి.

లేటెస్ట్ గా ఇలా బయటకొచ్చిన పేరు ఒక తరం వెనుకటి బాలీవుడ్ అందాల నటి మాధురీ దీక్షిత్. బాహుబలి పిక్చర్ కి సంబంధించినంతవరకూ హిందీ వెర్షన్ రైట్స్ కరణ్ జోహార్ దగ్గర ఉన్నాయి. మరింత మంది బాలీవుడ్ తారలను కాస్టింగ్ లో చేర్చడం ద్వారా.. ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకట్టుకోవాలన్నది కరణ్ ఆలోచనగా తెలుస్తోంది. ఈమెకోసం ఓ స్పెషల్ కేరక్టర్ ని డిజైన్ చేయాల్సిందిగా జక్కన్నను అడిగాడట కరణ్ జోహార్. ఇప్పుడు వినిపిస్తున్న టాక్స్ ప్రకారం అనుష్కకు సోదరిగా మాధురిని నటింపచేయాలన్నది వీరి ఆలోచన. ఈ మేరకు ఇప్పటికే మాధురీ దీక్షిత్ ని అడిగారని.. సుదీర్ఘ కాలం డేట్స్ ఇచ్చేందుకు ఆమె నిరాకరించిందంని చెప్పుకుంటున్నారు.

దీంతో కరణ్ జోహార్ ఇప్పుడు విద్యా బాలన్ ని ట్రై చేస్తున్నాడట. ఈ వార్తల్లో ఎంతవరకూ నిజం ఉందో తెలియాలంటే.. దర్శకధీరుడు రాజమౌళి తప్ప ఎవరూ చెప్పలేరు. ఆయన్ని అడిగినా కన్ ఫ్యూజ్ చేస్తారు తప్ప. కరెక్ట్ ఆన్సర్ సిల్వర్ స్క్రీన్ పై చూసుకోమంటారు. కాబట్టి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేవరకూ ఇలాంటి రూమర్స్ వినక తప్పదు.