Begin typing your search above and press return to search.

నోరు జార‌డ‌మేల‌... సారీ చెప్ప‌డ‌మేల‌

By:  Tupaki Desk   |   14 Nov 2018 7:52 PM IST
నోరు జార‌డ‌మేల‌... సారీ చెప్ప‌డ‌మేల‌
X
సెల‌బ్రిటీలు - ప్ర‌ముఖులు కూడా మ‌నుషులే క‌దా. అందుకే లోప‌లున్న‌వి అపుడ‌పుడు స్థాయిని ప‌క్క‌కు తోసేసి త‌న్నుకుని నోట్లోంచి బ‌య‌ట‌కు వ‌స్తుంటాయి. పాపం బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ కు కూడా అలాంటి సంద‌ర్భం వ‌చ్చేసింది. హాస్య మాడ‌బోయి అది మిస్ ఫైర్ కావడంతో చిక్కుల్లో పడ్డారు. ఇది నెటిజ‌న్ యుగం...సారీ చెప్పే దాకా వ‌దిలే ప్ర‌స‌క్తే ఉండ‌దుగా... దీంతో చివ‌ర‌కు క‌ర‌ణ్‌ సారీ చెప్పాల్సి వ‌చ్చింది.

కిర‌ణ్ ఖేర్ తెలుసు క‌దా. ఆమె బిజెపి నేత - టివి నటి. ఆమె ఈశాన్య రాష్ట్రపు వేష‌ధార‌ణ‌పై వేసిన జోకులు ఈశాన్య భారత ప్రజల మనోభావాలు దెబ్బతీశాయి. కరణ్ జోహార్ - టివి నటి కిరణ్ ఖేర్ ఇద్దరూ ఇండియాస్ గాట్ టాలెంట్ 6 డాన్స్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిరణ్ ఖేర్ నార్త్ ఈస్ట్ ప్రజలు ధరించే టోపీతో కనిపించింది. ఈ టోపీపై కరణ్ జోహార్ జోకులు పేల్చాడు. ఈ మాట‌లు ఆమెను ఏం బాధించ‌లేదు గానీ మా సంస్కృతిని అవ‌మానిస్తావా అనే విమ‌ర్శ‌లు ఎదుర‌య్యాయి.

ఇంత‌కీ ఇన్‌ స్టాగ్రామ్‌ లో పోస్టు చేసిన‌ ఆ వీడియోలో ఏముందంటే. కిర‌ణ్ ఖేర్ పెట్టుకున్న టోపీని చూస్తూ... *ఓ మై గాడ్.. నీ తలపై ఉన్నదేంటి.. ఆ టోపీ ఎందుకు పెట్టుకున్నావు.. నీకు ఇంకేమి టోపీలు దొరకలేదా* అంటూ వ్యాఖ్యానించాడు. ఈ టోపీ తనకు నార్త్ ఈస్ట్ ప్రజలు గిఫ్ట్ గా ఇచ్చారని కిరణ్ ఖేర్ తెలిపింది. వాళ్ళు నీ కోసం కూడా ఒక టోపీ ఇచ్చారని అంది. దానికి కరణ్ జోహార్ బదులిస్తూ.. *నాకు వద్దు.. నీ అంత ధైర్యం నాకు లేదు* అంటూ వ్యంగంగా వ్యాఖ్యానించారు. దీంతో ఈశాన్య ప్ర‌జ‌లు ఆయ‌న‌పై మండిపోయారు.

*కరణ్ జోహార్ గారు.. ఇత‌రులు ఇచ్చిన బ‌హుమానాల‌ను కించపరచకూడదనే విషయం తెలుసుకోండి. మీ వ్యాఖల వలన నార్త్ ఈస్ట్ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి* అని అన్నాడు.

స్పందించిన క‌ర‌ణ్‌ వివాదానికి అక్క‌డితో ఫుల్‌ స్టాప్ పెట్టాడు. స్పందించి క్షమాపణలు తెలియజేశారు. ఉద్దేశపూర్వకంగా అలా స్పందించలేదు, నాకు భారత దేశంలోని అన్ని సంప్రదాయాలపై గౌరవం ఉందని కరణ్ జోహార్ అన్నారు.