Begin typing your search above and press return to search.

ఆ ఇద్దరిని షో కు తీసుకు రావడం నా వల్ల కాదంటున్న కరణ్‌

By:  Tupaki Desk   |   26 Aug 2022 7:30 AM GMT
ఆ ఇద్దరిని షో కు తీసుకు రావడం నా వల్ల కాదంటున్న కరణ్‌
X
బాలీవుడ్‌ స్టార్‌ ఫిల్మ్‌ మేకర్ కరణ్‌ జోహార్‌ సుదీర్ఘ కాలంగా కాఫీ విత్ కరణ్‌ టాక్ షో ను నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. గత సీజన్ వరకు టీవీలో టెలికాస్ట్‌ అయిన ఈ షో ఇప్పుడు ఓటీటీ లో స్ట్రీమింగ్‌ అవుతున్న విషయం తెల్సిందే. కాఫీ విత్ కరణ్ టాక్ షో కొత్త సీజన్ వారం వారం బాలీవుడ్ సౌత్ ఇండియన్ సెలబ్రెటీలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తుంది.

కరణ్‌ జోహార్ అడిగితే బాలీవుడ్ స్టార్స్ మాత్రమే కాకుండా సౌత్‌ ఇండియన్ సినీ స్టార్స్ కూడా క్యూ కడుతారు. కొందరు కరణ్ పిలుపు కోసం ఎదురు చూస్తున్నాం అంటారు. ఆ షోలో పాల్గొనడం ద్వారా మంచి పాపులారిటీ వస్తుందని.. అలాగే తమ గురించి పూర్తి విషయాలను జనాలకు తెలియజేసే అవకాశం ఉంటుంది అంటూ చాలా మంది సెలబ్రెటీలు షో లో పాల్గొనేందుకు సిద్ధం అంటారు.

కొందరు కరణ్‌ తమను ఆహ్వానించాలని కోరుకుంటూ ఉంటారు.. ఎంతో పాపులారిటీ ఉన్న ఈ షో కు దాదాపు అందరు బాలీవుడ్‌ స్టార్స్‌ హాజరు అయ్యారు. కానీ కరణ్ జోహార్‌ మాత్రం ఇద్దరు స్టార్స్ ను ఈ షో కి తీసుకు రావడం లో విఫలం అయ్యాడు. ఆ విషయాన్ని స్వయంగా ఆయనే ఒప్పుకున్నాడు.

తాజాగా ఆయన మాట్లాడుతూ బాలీవుడ్ సీనియర్ స్టార్‌ హీరోయిన్ రేఖ గారితో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆమె నన్ను చాలా ఇష్టపడుతారు. అయినా కూడా నేను నా షో కు రమ్మని పిలిస్తే ఆమె పలు సార్లు నో చెప్పారు. ఆమె ను తీసుకు రావాలని ప్రయత్నించిన ప్రతిసారి కూడా నేను విఫలం అయ్యాను అన్నాడు.

ఇక యశ్‌ రాజ్ ఫిల్మ్స్ అధినేత ఆదిత్య చోప్రా ను షో కు తీసుకు రావాలని నేను అనుకుంటున్నాను. ఆయన నాకు గురువు.. మార్గదర్శకుడు. అటువంటి ఆయన్ను నా షో కు ఆహ్వానిస్తే కచ్చితంగా తిరష్కరిస్తాడు.. ఆ విషయం తెలిసి నేను ఆయన్ను ఎప్పుడు కూడా ఆహ్వానించలేదు అంటూ కరణ్‌ జోహార్‌ అన్నాడు.

కరణ్ వ్యాఖ్యలకు సోషల్‌ మీడియాలో మీమ్స్ వస్తున్నారు. మీరు పూర్తిగా షో ను సెక్స్ చుట్టు తిప్పుతున్నప్పుడు కాస్త గౌరవం ఉన్న వారు.. కాస్త పెద్ద మనిషి హోదా తో ఉన్న వారు ఎలా షో కు హాజరు కావాలని అనుకుంటారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్య అన్ని ఎపిసోడ్స్‌ కూడా చర్చ సెక్స్‌ చుట్టు తిరగడంతో ప్రేక్షకులు కూడా విమర్శిస్తున్నారు.