Begin typing your search above and press return to search.
బాలీవుడ్ కథ ముగియలేదు.. సౌత్ కమ్మేసిందంతే!
By: Tupaki Desk | 31 July 2022 8:00 PM ISTఉత్తరాది వారికి దక్షిణాది వారంటే చులకన. భౌగోళికంగా చూసినా దేశంలో పైన ఉన్న వారికి.. కిందన ఉన్న సౌత్ అంటే వారికి చులకనగా పలువురు అభివర్ణిస్తుంటారు. ఈ తరహా మాటల్ని వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల నోటి నుంచి కూడా వింటుంటాం. నార్త్.. సౌత్ మధ్య పోటీ ఎప్పుడూ ఉండనే ఉంటుంది. ఈ కారణంతోనే సౌత్ తరఫు వారు నార్త్ వారి మీద అధిక్యతను ప్రదర్శిస్తే అదో హాట్ టాపిక్ గా మారుతుంటుంది. తాజాగా అలాంటి పరిస్థితే సినిమా రంగంలో నెలకొనడం తెలిసిందే.
సౌత్ కు చెందిన పుష్ప.. ఆర్ఆర్ఆర్.. కేజీఎఫ్ ల పుణ్యమా అని వెలుగు జిమ్మే బాలీవుడ్ కళావిహీనంగా మారిందని.. దాని పని అయిపోయిందన్న వాదనలు జోరందుకున్నాయి. ఏదో రెండు.. మూడు సినిమాలు సూపర్ హిట్ అయి.. అదే సమయంలో బాలీవుడ్ మూవీలు ప్లాప్ అయితే.. బాలీవుడ్ కథ ముగిసిపోతుందనుకోవటానికి మించిన పిచ్చతనం మరొకటి ఉండదు. ఇప్పుడు అదే విషయాన్ని తన తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కమ్ దర్శకుడు కరణ్ జోహార్.
బాలీవుడ్ కథ ముగిసిపోయిందన్నది చెత్త అభిప్రాయంగా ఆయన తేల్చేశారు. ఈ మధ్యన విడుదలైన గంగూబాయి కాఠియావాడి.. భూల్ భులయ్య సినిమాల విజయాల్ని మర్చిపోకూడదంటున్నారు. ఈ రెండు సినిమాలు రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించిన వైనాన్ని గుర్తు చేవారు. అయితే.. సౌత్ నుంచి వస్తున్న సినిమాల జోరు ముందు బాలీవుడ్ బ్లాక్ బస్టర్ల జోరు పెద్దగా కనిపించటం లేదన్న నిజాన్ని ఆయన ఒప్పుకోవటం గమనార్హం.
సౌత్ నుంచి విడుదలైన పుష్ప.. ఆర్ఆర్ఆర్.. కేజీఎఫ్ సినిమాలు సాధించిన విజయాలు బాలీవుడ్ సినిమాల్ని కప్పేశాయని.. ఆ పరిస్థితి మారుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. హిందీ సూపర్ స్టార్లు అయినటువంటి అమీర్ ఖాన్.. షారుక్.. సల్మాన్.. అక్షయ్ కుమార్ ల చిత్రాలు త్వరలో వరుస పెట్టి విడుదల కానున్నాయని.. వాటితో బాలీవుడ్ తన పాత వైభవాన్ని కొని తెచ్చుకోవటం ఖాయమన్న అంచనాను వినిపించారు కరణ్. మరేం జరుగుతుందన్నది కాస్తంత వెయిట్ చేస్తే అర్థమవతుందని చెప్పక తప్పదు.