Begin typing your search above and press return to search.
పార్టీ నైట్ లో కలకలం.. 50 మంది స్టార్లకు కరోనా!
By: Tupaki Desk | 5 Jun 2022 9:48 AM IST2020-21 ప్రపంచానికి నేర్పిన పాఠం ఇంకా ఎవరూ మర్చిపోలేదు. కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. అన్ని పరిశ్రమలతో పాటు సినీపరిశ్రమలను మూత పడేలా చేసింది. అయితే 2022లో కరోనా నుంచి బయటపడిన ప్రపంచం నెమ్మదిగా అన్ని రంగాల్లోనూ కోలుకుంటోంది. ముఖ్యంగా వినోదపరిశ్రమకు ఇటీవల జవజీవాలు వస్తున్నాయి. టాలీవుడ్ బాలీవుడ్ సహా అన్ని పరిశ్రమలు షూటింగుల హడావుడితో పార్టీ నైట్ లతో సందడి చేస్తున్నాయి.
అయితే ఇంతలోనే కలకలం.. ఇటీవలి ఓ నైట్ పార్టీలో ఏకంగా 50 నుంచి 55 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిసి అంతా షాక్ కి గురవుతున్నారు. అయితే ఇది ఏ పార్టీలో అంటే ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ బర్త్ డే పార్టీలో చెలరేగిన కల్లోలం అని చెబుతున్నారు. కోవిడ్ వైరస్ ఈ పార్టీలో 50 మంది అతిథులపై ఎటాక్ చేసిందని గుసగుస వినిపిస్తోంది. అంతా సద్దుమణిగింది అనుకుంటుండగానే అకస్మాత్తుగా కొత్త కోవిడ్ ఇన్ఫెక్షన్ల గురించి ప్రజల్లో చర్చ సాగుతోంది. దేశంలో నెమ్మదిగా కేసులు రోజురోజుకు పెరుగుతుండడం కలవరపరుస్తోంది.
మే ఇరవై ఐదున దర్శకనిర్మాత కరణ్ జోహార్ తన 50వ పుట్టినరోజు సందర్భంగా ముంబైలో విలాసవంతమైన పార్టీని ఏర్పాటు చేసి భారీగా సినీస్టార్లను ఆహ్వానించారు. ఈ పార్టీకి తెలుగు స్టార్లకు కూడా ఆహ్వానం అందింది. అంధేరీ వెస్ట్ లోని యష్ రాజ్ స్టూడియోస్ లో జరిగిన ఈ థీమ్ పార్టీకి బాలీవుడ్ లోని పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అలాగే విజయ్ దేవరకొండ - రష్మిక మందన కూడా అటెండయ్యారు.
పార్టీలో తారాగణం లిస్ట్ ని పరిశీలిస్తే చాలా పెద్దది. కింగ్ ఖాన్ షారూక్- సల్మాన్ ఖాన్-అమీర్ ఖాన్ - సైఫ్ అలీ ఖాన్- కరీనా కపూర్ ఖాన్-అనన్య పాండే- జాన్వీ కపూర్- విక్కీ కౌశల్- మలైకా అరోరా- టబు- ట్వింకిల్ ఖన్నా- సోనాలి బింద్రే- మాధురీ దీక్షిత్- రవీనా టాండన్- జూహీ చావ్లా తదితరులు అటెండయ్యారు. అయితే ఈ పార్టీలో ఎంతగా ఆనందించారో అంతే చేదు వార్తను మరుసటి దినం వినాల్సి వచ్చిందట. చివరికి కరణ్ జోహార్ పుట్టినరోజు పార్టీకి హాజరైన తర్వాత కనీసం సుమారు 50 మంది అతిథులకు కోవిడ్ వైరస్ సోకినట్లు కథనాలొచ్చాయి. కోవిడ్ బాధితుల్లో పై వారిలో ఎంత మంది ఉన్నారో ఎవరికీ తెలియదు. ఇందులో తెలుగు హీరో విజయ్ దేవరకొండ కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఆసక్తికరంగా ఈ పార్టీకి అటెండయిన హీరోయిన్ తో తన సినిమాని ప్రచారం చేసుకున్న ఓ యువహీరోకి కూడా కరోనా పాజిటివ్ వచ్చిందన్న గుసగుస వేడెక్కిస్తోంది.
కరణ్ జోహార్ పార్టీలను నిషేధించాలి!
కరణ్ జోహార్ 50వ పుట్టినరోజు వేడుకకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. బాలీవుడ్ టాలీవుడ్ నుంచి ప్రత్యేక అతిథుల సమక్షంలో కరణ్ మిడ్ నైట్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆ పార్టీకి వెళ్లిన ట్వింకిల్ ఖన్నా చేసిన ఓ కామెంట్ వేడెక్కించింది. కరణ్ పార్టీలకు హాజరైన తర్వాత ఏం జరుగుతుందో చూపించే ఒక స్పెషల్ వీడియోను ఖన్నా ఇన్ స్టాలో షేర్ చేస్తూ .. అతడి పార్టీలను నిషేధించాలని ట్వింకిల్ అన్నారు. అయితే దానిని యాథృచ్ఛికంగా తన నోట పలికినా కానీ ఇప్పుడు అలా జరిగితే బావుండును అంటూ నెటిజనుల్లో డిబేట్ స్టార్టయ్యింది. అసలు పార్టీ దుష్ప్రభావాలు ఎలా ఉంటాయో ట్వింకిల్ ఖన్నా వర్ణించారు. పార్టీలో అందుబాటులో ఉన్న అనేక ఉచిత పానీయాలను ఈ వీడియోలో చూపించారు. కరణ్ జోహార్ అతని పార్టీలు.. ఉచిత పానీయాలు.. అలాగే మెరిసే స్కర్ట్ లు అన్నింటినీ నిషేధించాలని ట్వింకిల్ అన్నారు.
హ్యాంగోవర్.. తేరే ఫ్రీ డ్రింక్స్ కా! నేను ప్రతి లీపు సంవత్సరానికి ఒకసారి మాత్రమే పార్టీలకు వెళ్తాను. ప్రతి వారం ప్రజలు దీన్ని ఎలా ఆస్వాధిస్తారో తెలుసుకుని ఆశ్చర్యపోతున్నాను! అన్నారు. అలాగే వృత్తిగతంగా మాత్రం ఉండే వారిని ఆమె ప్రస్థావించింది. ఈ రెండిటిలో దేనిని ఎంత మంది ఇష్టపడతారో చూద్దాం.. పార్టీ వ్యతిరేకులను.... పార్టీ యానిమల్ ని ఒకే బోన్ లోకి రిలీజ్ చేస్తే.. మీరు ఏ వైపు ఉన్నారో నాకు తెలియజేయండి! అని అన్నారు. పార్టీపై ట్వింకిల్ యాధృచ్ఛికంగా కామెంట్ చేసినా కానీ నిజంగానే నిషేధిస్తే మేలు జరిగేదని ఇప్పుడు నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు. నైట్ పార్టీలో 50 మందికి కరోనా అంటుకుని ఉండేది కాదని కరణ్ ని నింధించడం స్టార్ట్ చేసారు.