Begin typing your search above and press return to search.

హే క‌ర‌ణ్ ఇట్స్ మీ.. ప్ర‌భాస్ వాయిస్ తో ఛీర్స్

By:  Tupaki Desk   |   1 Sep 2022 3:32 PM GMT
హే క‌ర‌ణ్ ఇట్స్ మీ.. ప్ర‌భాస్ వాయిస్ తో ఛీర్స్
X
`కాఫీ విత్ కరణ్` సీజన్ 7 అంత‌కంత‌కు రంజుగా మారుతోంది. ఇప్ప‌టికే 9 ఎపిసోడ్లు వీక్ష‌కులను అల‌రించాయి. ఈ షోలో సెల‌బ్రిటీల లైంగిక సంబంధాలు .. ప్రేమాయ‌ణాల గురించి ప్ర‌శ్నిస్తూ క‌ర‌ణ్ వేడెక్కిస్తున్నాడు. తాజాగా కృతి సనన్ - టైగర్ ష్రాఫ్ సోఫాలో చేరారు. ఈ ఎపిసోడ్ లో ఎక్కువ భాగం ఈ ఇద్దరూ ప్రస్తుతం ఒంటరిగా ఉన్నారా లేదా? అనే దానిపైనే ఎక్కువ‌గా ప్ర‌శ్న‌లు కురిపించాడు క‌ర‌ణ్. కానీ దానికి మించి ఎపిసోడ్ కి ప్రధాన హైలైట్ `బాహుబలి` స్టార్ ప్రభాస్ వాయిస్ అని చెప్పాలి.

షో చివరి సెగ్మెంట్ లో ఒక సెలబ్రిటీని పిలిచి ``హే కరణ్ ఇట్స్ మీ`` అని చెప్పాలి. ఇప్పుడు మొదటిసారిగా ప్రభాస్ కి కృతి సనన్ కాల్ చేసింది. ``హే కరణ్ ఇట్స్ మీ ప్రభాస్`` అంటూ ప్రభాస్ తన కాల్ ని పికప్ చేయడంతో డార్లింగ్ గంభీర‌మైన‌ వాయిస్ చాలా ఆశ్చర్యపరిచింది. షో వీక్ష‌కుల‌కు ఇది స్పెష‌ల్ ఛీర్స్ గా మారింది.

ఓం రౌత్ ఆదిపురుష్ లో ప్రభాస్ - కృతి సనన్ ఇద్దరూ మొదటిసారి కలిసి పనిచేశారు. ప్ర‌భాస్ శ్రీ‌రాముడుగా న‌టించ‌గా .. సీత పాత్ర‌లో కృతి స‌నోన్ న‌టించింది. సినిమా చిత్రీకరణ సమయంలో వారి మధ్య మంచి స్నేహం ఏర్పడిందని కృతి చేసిన కాల్ లో అది స్పష్టంగా అర్థ‌మ‌వుతోంది.

ఈ షోలో కృతి.. టైగ‌ర్ ల‌తో క‌ర‌ణ్ బోలెడ‌న్ని ప‌రాచికాలు ఆడాడు. టైగర్ ష్రాఫ్ ప్రస్తుతం ఒంటరిగా ఉన్నాడని .. దిశా పటానీకి మంచి స్నేహితుడు మాత్రమేనని చెప్పించాడు. టైగ‌ర్ అనన్య పాండేతో డేటింగ్ చేయడానికి ముందుగా అంగీకరించాడు. శ్ర‌ద్ధా క‌పూర్ ని ఇష్ట‌ప‌డుతున్నాన‌ని అన్నాడు.

అయితే కరణ్ జోహార్ ఇప్పుడు తారా సుతారియా వైపు చూస్తున్నట్లు సూచించాడు. అదే సమయంలో కృతి సనన్ కూడా తాను చాలా కాలం నుండి ఒంటరిగా ఉన్నానని పేర్కొంది. అయితే త్వరలో ఆదిత్య రాయ్ కపూర్ తో పూర్తి సమయం డేటింగ్ చేయవచ్చని కూడా తెలిపింది. మొత్తానికి ఎవ‌రు ఎవ‌రితో ప్రేమ‌లో ప‌డ‌తారో కానీ షో ఆద్యంతం రంజుగా సాగింది. అలాగే ప్ర‌భాస్ వాయిస్ నిజంగానే ఛీర్స్ అని చెప్పాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.