Begin typing your search above and press return to search.

రికార్డు బ్రేకింగ్ సాంగ్ 'టైటిల్'తో కప్పెలా రీమేక్..!

By:  Tupaki Desk   |   24 March 2021 10:00 PM IST
రికార్డు బ్రేకింగ్ సాంగ్ టైటిల్తో కప్పెలా రీమేక్..!
X
ఈ మధ్యకాలంలో మలయాళం నుండి తెలుగులోకి చాలా సినిమాలు రీమేక్ అవుతున్నాయి. గతేడాది అయ్యప్పనమ్ కోషియం తెలుగు రీమేక్ హక్కులను పొందిన సితార ఎంటర్టైన్మెంట్స్.. మలయాళ రొమాంటిక్ థ్రిల్లర్ కప్పేల రీమేక్ హక్కులను కూడా సొంతం చేసుకుంది. థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన కప్పేలా సినిమాలో అన్నా బెన్, శ్రీ‌నాథ్ భ‌సి, రోష‌న్ మాథ్యూ ప్ర‌ధాన పాత్ర‌లలో నటించారు. ఈ సినిమాకు మ‌హ్మ‌ద్ ముస్తాఫా దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమా ఓవైపు ప్రేక్షకులతో పాటు విమర్శకులను ప్రశంసలు అందుకుని రికార్డు సృష్టించిందని చెప్పాలి. ఓటిటి పరంగా కూడా నెట్ ఫ్లిక్స్ లో విడుదలై మంచి ఆదరణ దక్కించుకుంది. ప్రస్తుతం కప్పేలా రీమేక్ పనులు టాలీవుడ్ లో వేగంగా జరుగుతున్నాయి.

ఈ రీమేక్ మూవీలో హీరోయిన్ గా 'ఎంతవారుగాని', విశ్వాసం సినిమాల ఫేమ్ అనిఖా సురేంద్రన్ ఓకే అయినట్లు టాక్. ఇప్ప‌టికే ఈ సినిమా గురించి అనిఖాతో మేకర్స్ చర్చలు జరిపారట. మంచి స్కోప్ ఉన్న పాత్ర కావడంతో అనిఖా ఈ రీమేక్ లో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వనుందని ఇండస్ట్రీ టాక్. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలోని శ్రీ‌నాథ్, రోష‌న్ పాత్ర‌ల్లో విశ్వ‌క్ సేన్, న‌వీన్ చంద్ర న‌టించే అవ‌కాశ‌ముంద‌ని వినికిడి. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు బుట్టబొమ్మ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. మేకర్స్ కూడా బుట్టబొమ్మ అనే టైటిల్ ఖరారు చేసే ఆలోచనలో ఉన్నారట. అలవైకుంఠపురంలో సినిమాలోని బుట్టబొమ్మ సాంగ్ ఎంత పాపులర్ అయిందో అందరికి తెలిసిందే. ఇలాంటి సూపర్ హిట్ సాంగ్ నేమ్ టైటిల్ పెడితే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. చూడాలి అధికారిక ప్రకటన ఎప్పుడు రానుందో!