Begin typing your search above and press return to search.

లిప్ లాక్ తో 2022కి వెల్క‌మ్ చెప్పిన క‌పూర్ గాళ్

By:  Tupaki Desk   |   1 Jan 2022 2:30 PM GMT
లిప్ లాక్ తో 2022కి వెల్క‌మ్ చెప్పిన క‌పూర్ గాళ్
X
బాలీవుడ్ హీరోయిన్లు.. హాట్ క‌పుల్స్ విదేశాల్లో న్యూఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే. వారం ముందుగానే ఒంట‌రి దీవుల‌కు అంతా ప్లైట్ ఎక్కేసారు. కొంద‌రు దుబాయ్ యూర‌ప్ ల‌కు వెళితే.. మ‌రికొంద‌రు గోవా లాంటి స్వదేశీ బీచ్ ల‌ను ఆశ్ర‌యించారు. అదంతా అటుంచితే క‌పూర్ గాళ్ సోన‌మ్ క‌పూర్- ఆమె భ‌ర్త ఆనంద్ ఆహుజా కొత్త ఏడాది 2022కి లిప్ లాక్ తో వెల్క‌మ్ చెప్పారు. లండ‌న్ లోని నాటింగ్ హిల్ హోమ్ లో ఈ దంప‌తులు గ్రాండ్ గా వేడుక‌ల్ని సెల‌బ్రేట్ చేసుకున్నారు. అందాల న‌టి ప్ర‌తీ సంవ‌త్స‌రం మాదిరిగానే ఈ ఏడాది ఆనంద్ తో రొమాంటిక్ కిస్ ఫోటోను పంచుకున్నారు. ఈ జంట‌ నలుపు దుస్తులు ధ‌రించారు. బ్లాక్ అండ్ బ్లాక్ ఓ కోడ్ లాంటింది. అందుకే ఈ జంట న‌లుపు కోడ్ పాటిస్తూ రొమాంటిక్ సీన్ ని ఆవిష్క‌రించారు అంటూ యూత్ కామెంట్ చేస్తున్నారు.

2021 గుడ్ బై చెబుతూ 2022కి వెల్క‌మ్ చెబుతూ లిప్ లాక్ లో మునిగిపోయారు. ఈ ఫోటోని సోన‌మ్ ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేసింది. ``నా జీవితంలో ప్రేమ‌కు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు. అత‌ను ప్ర‌తీ రోజు ఎంతో అద్భుత‌మైన వాడు అని హ‌బ్బీని ఉద్దేశించి పొగిడేసింది. ప్ర‌తి సంవ‌త్స‌రం అత‌నితోనే నా న్యూఇయ‌ర్ గ‌మ‌నం. అంద‌రికీ హ్యీపీ న్యూ ఇయ‌ర్. అంతా ఆయురారోగ్యాల‌తో సంతోషంగా ఉండాలి`` అని సోన‌మ్ విషెస్ తెలిపింది. దీంతో సోన‌మ్ అభిమానులు పెద్ద ఎత్తున రిప్ల‌య్ విషెస్ తో జోరందుకున్నారు.

ఇక ఈ జంట కొంత కాలంగా లండ‌న్ లోనే ఉంటున్నారు. ఇటీవ‌లే ఇండియాలోనే త‌న కుటుంబ స‌భ్యుల్ని మిస్ అవుతున్న‌ట్లు సోన‌మ్ ఓ పోస్ట్ పెట్టింది. ఆమె సోద‌రి రియా క‌పూర్ కూడా సోన‌మ్ పై త‌న ప్రేమ‌ని చాటి చెప్పింది. ఇక సోనమ్ క‌పూర్ సినిమాల విష‌యానికి వ‌స్తే `బ్లైండ్` అనే చిత్రంలో న‌టిస్తోంది. ఇందులో సోన‌మ్ అంధురాలైన‌ పోలీస్ పాత్ర‌లో న‌టిస్తోంది. ఓ సీరియ‌ల్ కిల్ల‌ర్ అన్వేష‌ణ‌ నేప‌థ్యంలో ఈ మూవీ తెర‌కెక్కుతోంది.