Begin typing your search above and press return to search.

కపూర్ లు ఆ రికార్డ్ కూడా పట్టేశారు

By:  Tupaki Desk   |   17 May 2016 5:53 AM GMT
కపూర్ లు ఆ రికార్డ్ కూడా పట్టేశారు
X
సినిమా రంగంలో ప్రతీ భాషలోనూ వారసులు రాజ్యం చేయడం చూస్తూనే ఉన్నాం. ఒకరూ సూపర్ స్టార్ గానో, మెగాస్టార్ గానో ఎదిగిన తర్వాత.. తర్వాతి తరం ఆ ఇమేజ్ తో ఈజీగా తెరంగేట్రం చేసేస్తున్నారు. ప్రస్తుతం మన టాలీవుడ్ లో మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి అర డజన్ కు పైగా నటులు వచ్చేస్తే అబ్బో అనుకుంటున్నాం. కానీ బాలీవుడ్ లో కపూర్ ఫ్యామిలీ నుంచి 2 డజన్ల మంది సినిమాల్లో సత్తా చాటుతున్నారని తెలుసా?

పృథ్వీ రాజ్ కపూర్.. బాలీవుడ్ లో కపూర్ ల ప్రస్థానం ఈయనతో మొదలైంది. 40 ఏళ్ల కెరీర్ లో పద్మభూషణ్ - దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులనూ అందుకున్నారు. ఈయన కుమారులు రాజ్ కపూర్ - షమ్మీ కపూర్ - శశి కపూర్ లు ఇండస్ట్రీలోకి వచ్చినా.. రాజ్ కపూర్ టాప్ రేంజ్ కి వెళ్లారు. ఈ యన కూడా పద్మ భూషణ్ - దాదా సాహెబ్ ఫాల్కేలను అందుకున్నారు. ఆ తర్వాత కపూర్ ఫ్యామిలీ నుంచి రణధీర్ కపూర్ - రిషి కపూర్ లు ఎంట్రీ ఇచ్చారు. వీరు ఒక తరం వెనుక సంగతి.

ఇప్పుడైతే కరిష్మా కపూర్ - కరీనా కపూర్ - రణ్ బీర్ కపూర్.. ఇలా చెప్పుకుంటూ పోతే.. కపూర్ ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి వచ్చిన వారి సంఖ్య అక్షరాలా 24 మంది. అందుకే ఇంతమందిని సినీరంగానికి ఇచ్చిన కపూర్ ఫ్యామిలీ.. ఇప్పుడు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి కూడా ఎక్కేసింది.