Begin typing your search above and press return to search.

వైరల్ అవుతున్న కపూర్ బ్యూటీ ట్రెండీ లుక్..!

By:  Tupaki Desk   |   7 April 2021 10:00 PM IST
వైరల్ అవుతున్న కపూర్ బ్యూటీ ట్రెండీ లుక్..!
X
బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీకపూర్.. ప్రస్తుతం గ్లామర్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అలాగే ఇండస్ట్రీలో సొంతంగా అవకాశాలు రాబట్టుకునే ప్రయత్నం చేస్తుంది. మరాఠిలో సూపర్ హిట్ అయిన 'సైరాత్‌' సినిమాకు రీమేక్‌గా రూపొందిన ధడక్ సినిమాతో బాలీవుడ్ హీరోయిన్ అరంగేట్రం చేసింది. ఆ సినిమా హిట్ అవ్వడంతో జాన్వీ పాపులారిటీ దక్కించుకుంది. ఇదివరకు ఎప్పుడు చూసినా నాన్నకూచి, అమ్మకూచిలా కనిపించిన జాన్వీ.. హీరోయిన్ అయ్యాక సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. లేత వయ్యారాలతో బాలీవుడ్ ఇండస్ట్రీని తన వైపు తిప్పుకొని.. అమాంతంగా మిలియన్ల సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకుంది. చేసింది మూడు నాలుగు సినిమాలే కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం మాములుగా లేదు.

జాన్వీ శ్రీదేవి కూతురు అన్నట్లే గాని తనకు తానుగా నిలదొక్కుకోవడానికి విపరీతంగా ట్రై చేస్తుంది. ఎల్లప్పుడూ తన అందాలను ఆరబోసే ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తుంటుంది. తాజాగా ఈ కుర్ర బ్యూటీ ముంబై విమానాశ్రయంలో దర్శనమిచ్చింది. కారులో నుండి కిందికి దిగి అలా ఎయిర్పోర్ట్ గేట్ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా మీడియా కంటపడింది. విమానాశ్రయంలో జాన్వీని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే అమ్మడికి డ్రెస్సింగ్ సెన్స్ చాలా ఉంది. అందుకే సమ్మర్ లో ఎలాంటి కాస్ట్యూమ్స్ ట్రెండీగా ధరిస్తుంది. తాజాగా ఫోటోలో జాన్వీ బ్లాక్ అండ్ వైట్ ఫ్లోరల్ జంప్ సూట్ ధరించింది. అలాగే హై హీల్స్ తో పాటు అందమైన బ్రేస్ లెట్స్ కూడా జాన్వీకి మరింత అందాన్ని తీసుకొచ్చాయి. వైట్ మాస్క్ ధరించి జాన్వీ ఎయిర్పోర్ట్ ప్రోటోకాల్ స్ట్రిక్ట్ గా ఫాలో అవుతుందట. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ.. 'తక్త్‌' దోస్తానా-2 సినిమాలలో నటిస్తోంది.