Begin typing your search above and press return to search.

కపూర్‌ గారి అబ్బాయిలు షాకిచ్చారు

By:  Tupaki Desk   |   13 April 2016 4:00 AM IST
కపూర్‌ గారి అబ్బాయిలు షాకిచ్చారు
X
ఈ కపూర్‌ గారి కుర్రాళ్ళు ఉన్నారు చూడండి.. అబ్బే ఆ రణబీర్‌ కపూర్‌ అండ్‌ అర్జున్‌ కపూర్‌ వంటి బాబులు కాదు.. మనం మాట్లాడుతోంది ''కపూర్‌ అండ్‌ సన్స్‌'' సినిమాలోని కుర్రాళ్ళ గురించి. వీరు మామూలు రేంజు హిట్టు కొట్టలేదు. ఏదో చేస్తారులే అని అందరూ అనుకుంటున్నతరుణంలో.. వారు తమ సినిమా ఒక 100 కోట్ల క్లబ్‌ సినిమా అని ప్రూవ్‌ చేశారు. ఇప్పుడు అక్కడే ఆగమన్నా ఆగట్లేదు.

మార్చి 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ఇప్పటి వరకూ 150 కోట్లు గ్రాస్‌ వసూలు చేసింది తెలుసా. షకున్‌ బాత్రా డైరక్షన్‌ లో రూపొందిన ఈ సినిమాలో.. సిద్ధార్థ్‌ మల్హోత్రా - ఫవాద్‌ ఖాన్‌ - అలియాభట్‌ లు మెయిన్ లీడ్స్‌ అయితే.. తల్లి పాత్రను పోషించిన రత్నా పతక్‌.. తాత పాత్రలో రిషి కపూర్‌ అదరగొట్టేశారు. కేవలం ఇద్దరి అన్నదమ్ముల మధ్యన ఉన్న ఫ్రిక్షన్.. ఒక ఫ్యామిలీలో మిస్సయిన ఎమోషనల్‌ సింక్‌ ను బేస్‌ చేసుకొని ఈ సినిమాను రూపొందించాడు దర్శకుడు. ఇండియాలో 104 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం.. ఓవర్సీస్‌ లో 46.7 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా 150 కోట్ల గ్రాస్‌ మార్కును టచ్‌ చేసింది.

అయితే ఇలాంటి ఫ్లేవర్‌ సినిమాలు మన టాలీవుడ్‌ లో కూడా వస్తే బాగుంటుంది. చిన్న సినిమాలే అనుకున్న ఈ కపూర్‌ గారబ్బాయిలు ఈ రేంజులో షాకిచ్చాక.. ఇలాంటి కథల ఇక కోకొల్లలుగా వస్తాయిలే.