Begin typing your search above and press return to search.

సూపర్‌ కమెడియన్‌.. సిల్లీ ఫ్లాప్‌

By:  Tupaki Desk   |   25 Sep 2015 7:30 PM GMT
సూపర్‌ కమెడియన్‌.. సిల్లీ ఫ్లాప్‌
X
కామెడీ నైట్స్ విత్ క‌పిల్ షోతో బుల్లితెర‌పై యాంక‌ర్‌ గా పాపుల‌ర్ అయ్యాడు క‌పిల్ శ‌ర్మ‌. యాంక‌ర్‌ - న‌టుడు - సింగ‌ర్ ఇన్ని అర్హ‌త‌లున్నాయ్ ఈ కుర్రాడికి. సిఎన్ ఎన్ ఐబిఎన్ - ఫోర్బ్స్ వంటి ప్ర‌ఖ్యాత సంస్థ‌లు గుర్తించిన క‌మెడియ‌న్ కూడా. పాపుల‌ర్ యాంక‌ర్‌ గానూ గుర్తింపు ఉంది.

వ‌రుస‌గా 2013 - 2014 ఫోర్బ్స్ జాబితాలో 100లోపు ర్యాంకింగ్‌లో కొన‌సాగిన క‌మెడియ‌న్‌. స్వచ్ఛ‌భార‌త్ అభియాన్‌ కి ప్ర‌ధాని మోడీ ఇత‌డిని బ్రాండ్ అంబాసిడ‌ర్‌ గా ఎంపిక చేసుకున్నారు. ఇన్ని అర్హ‌తలు ఉన్న ఇత‌గాడు వెండితెర‌పైకి వ‌చ్చి పూర్తిగా అభాసు పాల‌వ్వ‌డం ప్ర‌స్తుతం చ‌ర్చ‌ల్లోకి వ‌చ్చింది. క‌పిల్ శ‌ర్మ కిస్ కిస్‌ కో ప్యార్ క‌రూన్ సినిమాతో డెబ్యూ హీరోగా లాంచ్ అయ్యాడు. తొలి సినిమానే బాక్సాఫీస్ వ‌ద్ద అట్ట‌ర్‌ ఫ్లాప్‌. అప్ప‌టికే ముగ్గురు పెళ్లాలు ఉన్న ఓ కుర్రాడు మ‌ళ్లీ మ‌ళ్లీ మ్యాట్రిమొనీల‌పై ప‌డి కొత్త పెళ్లి కోసం ఎటెంప్ట్ చేస్తుంటాడు. ఈ క్ర‌మంలో అత‌డి మ్యాన‌రిజంతో న‌వ్వులు పూయించే ప‌ని పెట్టుకున్నారు. క‌పిల్ శ‌ర్మ యాక్టింగ్‌ - కామెడీ టైమింగ్ చూస్తే ఏడుపొచ్చింది. చెవులు మూసుకున్నా - క‌ళ్లు మూసుకున్నా .. అంటూ స‌మీక్ష‌కులు ఎద్దేవా చేశారు. ప‌ర‌మ వ‌ర‌స్ట్ సినిమా అంటూ తిట్టిపోశారు.

ఏదేమైనా ఇది బ్యాడ్ ఎక్స్‌పీరియ‌న్స్‌. మొద‌టి ప్ర‌య‌త్నం ఫెయిటైంది. సిల్లీ ఫ్లాపుగా మిగిలిపోయింది. రెండో ప్ర‌య‌త్నంలో స‌క్సెస్ అవుతాడేమో చూడాలి. ఎలానూ బుల్లితెర‌పై ఛరిష్మా ఉన్న‌వాడు. పెద్ద లెవ‌ల్ కాంటాక్ట్స్ ఉన్న‌వాడు కాబ‌ట్టి మునుముందు ఏదోలా మ్యానేజ్ చేసేస్తాడు. వెయిట్ అండ్ సీ..