Begin typing your search above and press return to search.
నన్ను బంధించి అబార్షన్ చేయించుకునే ప్రయత్నం
By: Tupaki Desk | 22 July 2020 10:00 AM ISTహాలీవుడ్ నటుడు ర్యాపర్ అయిన కాన్యే వెస్ట్ అనూహ్యంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలవడంతో వార్తల్లోకి వచ్చాడు. తనకు ట్రంప్ అంటే చాలా అభిమానం అంటూనే ఆయనపై పోటీకి కాన్యే రెడీ అయ్యాడు. నవంబర్ లో జరుగబోతున్న అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు కోసం కాన్యే ప్రచారం కూడా మొదులు పెట్టాడు. పలువురు పారిశ్రామిక వేత్తలు మరియు కొన్ని సంఘాలు కాన్యేకు మద్దతుగా నిలుస్తున్నాయి. ఇలాంటి సమయంలో రాజకీయంగా ఆయన్ను దెబ్బకొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాన్యే ట్విట్టర్ లో చేసిన ట్వీట్స్ ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నాయి.
తన భార్య కిమ్ కర్దాషియాన్ అబార్షన్ చేయించుకునేందుకు నేను ఒకప్పుకోక పోవడంతో నన్ను గదిలో బంధించేందుకు ప్రయత్నం జరిగింది. నన్ను మానసిక వికలాంగుడిగా చిత్రీకరించి తద్వారా ఆమె అనుకున్నది చేయాలనుకుంటుంది అంటూ ట్వీట్ చేశాడు. డాక్టర్‌తో కలిసి నన్ను గదిలో బంధించిందంటూ కాన్యే ట్వీట్స్ చేశాడు. కాన్యే వరుస ట్వీట్స్ వైరల్ అయ్యాయి. అయితే కొన్ని నిమిషాలకే ఆ ట్వీట్స్ ను అతడు తొలగించడం కూడా జరిగింది. అధ్యక్ష ఎన్నికలకు ప్రచారం మొదలు పెట్టిన తర్వాత రోజే ఇలాంటి చర్చ జరగడంతో అమెరికన్స్ అంతా కూడా ఇప్పుడు కాన్యే గురించిన ఆలోచన చేస్తున్నారు.
కిమ్ తనను గదిలో బంధించి డాక్టర్ తో కలిసి పారిపోయి అబార్షన్ చేయించుకునేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో తన కూతుర్ల జీవితాలను కాపాడాలంటూ విజ్ఞప్తి చేశాను. కిమ్ తల్లికి ఫోన్ చేసి విషయాన్ని చెప్పాను. ఆ ట్వీట్‌ను కూడా వెంటనే కాన్యే డిలీట్ చేశాడు. మొత్తానికి ప్రస్తుతం కాన్యే విషయం అమెరికన్స్‌లో చర్చకు తెర లేసింది. అధ్యక్ష ఎన్నికల్లో ఉన్న కాన్యే ఇలాంటి వ్యవహారంతో మీడియా ముందుకు రావడం పట్ల రాజకీయంగా కూడా చర్చ జరుగుతోంది.