Begin typing your search above and press return to search.

వీడియో : శివాని 'కన్నులు చెదిరే...'

By:  Tupaki Desk   |   30 May 2021 10:49 AM GMT
వీడియో : శివాని కన్నులు చెదిరే...
X
జీవిత రాజశేఖర్‌ ల చిన్నమ్మాయి శివాత్మిక ఇప్పటికే దొరసాని సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. దొరసాని చిత్రానికి ముందే పెద్దమ్మాయి శివాని హీరోయిన్ గా ఒక సినిమా రావాల్సి ఉంది. కాని కొన్ని కారణాల వల్ల శివాని ఎంట్రీ ఆలస్యం అయ్యింది. తమిళంలో కూడా ఒక సినిమా పట్టాలెక్కినా అది కొసకెల్లలేదు. మొత్తానికి శివాని సినీ ఎంట్రీ చాలా ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు 'WWW' సినిమా తో శివాని హీరోయిన్ గా పరిచయం అవ్వబోతుంది. కేవీ గుహన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా నుండి మొదటి పాట ను తాజాగా విడుదల చేశారు.

కన్నులు చెదిరే అంటూ సాగే పాటతో శివాని మరియు అదిత్ అర్జున్‌ లు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇమోన్ కె కింగ్ సంగీతం అందించిన ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించాడు. యాజిన్ నిజార్ ఆలపించిన ఈ మెలోడీ సాంగ్ ఆకట్టుకునే విధంగా ఉంది. చక్కని విజువల్స్ తో పాటు వినసొంపైన సంగీతం మరియు ఈజీగా అర్థం అయ్యే సాహిత్యంతో పాట సాగింది. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగేలా పాట ఉందంటూ నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి.

పాట విడుదల సందర్బంగా దర్శకుడు గుహన్ మాట్లాడుతూ.. తెలుగులో ఈతరహా కాన్సెప్ట్‌ తో మూవీ మొదటిది. ఒకేసారి తెలుగు మరియు తమిళంలో ఈ సినిమాను రూపొందిస్తున్నాం. పాటలు మరియు టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. కంప్యూటర్‌ స్క్రీన్‌ థ్రిల్లర్‌ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుందని పేర్కొన్నాడు. ఈ చిత్రంలోని తమన్నా విడుదల చేసిన నైలునది పాటకు మంచి స్పందన వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని నిర్మాత అన్నాడు. ఈ సినిమాలో కీలక పాత్రలో ప్రియదర్శి మరియు వైవా హర్షలు కనిపించబోతున్నారు.