Begin typing your search above and press return to search.

కొత్త ఏడాదిలో 'కాంతార‌-2' షురూ!

By:  Tupaki Desk   |   28 Dec 2022 6:57 AM GMT
కొత్త ఏడాదిలో కాంతార‌-2 షురూ!
X
చిన్న సినిమాగా రిలీజ్ అయిన క‌న్న‌డ చిత్రం 'కాంతార' ఎంత పెద్ద విజ‌యం సాధించిందో తెలిసిందే. బాక్సాఫీస్ వ‌ద్ద ఏకంగా 400 కోట్ల వ‌సూళ్లు సాధించి క‌న్న‌డ ఇండ‌స్ర్టీలో రెండ‌వ అతి భారీ వ‌సూళ్ల చిత్రంగా నిలిచింది. రిశ‌బ్ శెట్టి స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సినిమా తో అత‌ని రేంజ్ మారిపోయింది. ఈ విజ‌యంతో బాలీవుడ్..కోలీవుడ్..టాలీవుడ్ స‌హా అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లోనూ రిష‌బ్ శెట్టికి అవ‌కాశాలు వ‌స్తున్నాయి.

అత‌నిపై కోట్ల రూపాయ‌లు గుమ్మ‌రించ‌డానికి నిర్మాత‌లు సిద్దంగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో కాంతార‌-2 ఉంటుందా? ఉండ‌దా? అన్న ఓ సందేహం తెర‌పైకి వ‌చ్చింది. స‌క్సెస్ నేప‌థ్యంలో కాంతార‌-2 తెర‌పైకి వ‌చ్చినా ఇప్పట్లో సాధ్య‌మేనా? అని ప్ర‌ధానంగా డౌట్ రెయిజ్ అయింది.

అయితే హొంబ‌లే ఫిల్మ్స్ అధినేత కిరంగ‌దూర్ అన్ని సందేహాల్ని ప‌టాం పంచ‌ల్ చేసారు.రిశ‌బ్ శెట్టి నెల రోజుల విశ్రాంతి అనంత‌రం కాంతార‌-2 మొద‌ల‌వుతుంద‌ని తెలిపారు. దీంతో 'కాంతార‌-2' షురూ అయింది. అయితే రెండ‌వ భాగానికి సంబంధించి క‌థ సిద్దంగా లేదు.ముందు క‌థ సిద్దం చేయాలి.

వ‌చ్చే ఏడాది నుంచి రిష‌బ్ శెట్టి ఆ ప‌నుల్లో బిజీ కానున్నారు. ఆ క‌థ పూర్త‌యిన త‌ర్వాత సెట్స్ కి తీసుకెళ్ల‌డం..షూట్ పూర్తవ్వ‌డం వంటివి అంతే వేగంగా జ‌రుగుతాయ‌ని నిర్మాత మాట‌ల్ని బ‌ట్టి తెలుస్తోంది.

హొంబ‌లే ఫిల్మ్స్ వ‌రుస‌గా భారీ బ‌డ్జెట్ సినిమాలు చేస్తోన్న నేప‌థ్యంలో కాంతార‌-2 విష‌యంలో డిలే చేసే అవ‌కాశం ఉంద‌ని మీడియాలో క‌థ‌నాలొచ్చాయి. కానీ వాటితో సంబంధం లేకుండా కాంతార‌-2 హొంబ‌లే సెట్స్ కి తీసుకెళ్ల‌బోతుంది.

ఈసారి బ‌డ్జెట్ స్పాన్ భారీగా పెంచే అవ‌కాశం ఉంది. పాన్ ఇండియా రేంజ్లో సినిమా రిలీజ్ చేయ‌నున్నారు. ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి దేశ వ్యాప్తంగా 'కాంతార‌-2' గురించి ప్ర‌మోట్ చేసే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం రిశ‌బ్ శెట్టి విశ్రాంతిలోఉన్నారు. అన్ని భాష‌ల ప‌రిశ్ర‌మ‌ల స్టార్స్ నుంచి ప్ర‌శంస‌లు రావ‌డంతో వాళ్ల ఆహ్వానం మేర‌కు వెళ్లి క‌ల‌వ‌డం జ‌రుగుతుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.