Begin typing your search above and press return to search.

పాటల్లో... 'కన్నుల్లో నీ రూపమే..'

By:  Tupaki Desk   |   13 Sept 2016 4:00 AM IST
పాటల్లో... కన్నుల్లో నీ రూపమే..
X
నందు... తేజస్విని ప్రకాశ్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'కన్నుల్లో నీ రూపమే..'. కొత్త దర్శకుడు బిక్స్ తెరకెక్కిస్తున్న ఈ అందమైన ప్రేమకథా చిత్రం టాకీ పూర్తి చేసుకుంది. ఇటీవలే హీరో నందు.. ఇతర నటీనటులపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. మూడు నెలల పాటు శరవేగంగా షూటింగ్ జరుపుకున్న 'కన్నుల్లో నీ రూపమే..' చిత్రం త్వరలో పాటల కోసం కర్ణాటకలోని అందమైన లొకేషన్లకు వెళ్లనుంది. పాటల చిత్రీకరణతో సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుంది. ఇక పోస్ట్ ప్రొక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసి.. సినిమాను విడుదల చేయడమే తరువాయి.

పోసాని కృష్ణమురళి - థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను ఎస్.పి. క్రియేటివ్‌ ఆర్ట్స్‌ పతాకంపై భాస్కర్‌ బాసాని నిర్మిస్తున్నారు. సంగీతం సాకేత్ కోమండూరి అందిస్తున్నారు. ఇటీవల మినిమమ్ బడ్జెట్టుతో తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన పెళ్లిచూపులు మూవీలో అతిథి పాత్రలో నటించిన నందు పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. అయితే ఈసారి మాత్రం సోలో హీరోగా ట్రై చేస్తున్నాడు. కర్నాటక అమ్మాయి తేజస్విని అతనితో స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రమైనా.. నందును ఫుల్ టైమ్ హీరోగా నిలబెట్టాలని ఆశిద్దాం.​