Begin typing your search above and press return to search.

కన్నయ్య 'ఫ్యామిలీ డ్రామా' ఇంట్రెస్టింగ్‌ పోస్టర్‌

By:  Tupaki Desk   |   20 July 2021 7:42 AM GMT
కన్నయ్య ఫ్యామిలీ డ్రామా ఇంట్రెస్టింగ్‌ పోస్టర్‌
X
కమెడియన్ గా సుహాస్‌ మంచి పాత్రలే చేశాడు. సీరియస్ గా కనిపిస్తూ కామెడీ చేసే కమెడియన్స్ కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఆ కొద్ది మందిలో ఒకడు సుహాస్‌ అనడంలో సందేహం లేదు. కామెడీతో పాటు ఎమోషనల్ సీన్స్‌ ను కూడా పండించడంలో సుహాస్ మంచి ప్రతిభ ఉన్న నటుడు అంటూ కలర్‌ ఫొటో సినిమాతో నిరూపితం అయ్యింది.

కమెడియన్ గా కొన్ని సినిమాలే చేసినా కూడా నటుడిగా మంచి పేరును దక్కించుకున్న సుహాస్‌ హీరోగా కలర్‌ ఫొటో సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా కాస్త మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో వరుసగా సినిమాల ఆఫర్లు వస్తున్నాయి. హీరోగా వరుసగా వస్తున్న ఆఫర్లకు కమిట్‌ అవ్వకుండా మంచి కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌ కథలను మరియు ప్రతిభావంతులైన దర్శకులను మాత్రమే సుహాస్‌ ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేయాలనుకుంటున్నాడట.

అందుకే కలర్‌ ఫొటో తర్వాత చిన్న గ్యాప్ వచ్చింది. హీరోగా సుహాస్‌ రెండవ సినిమా కన్ఫర్మ్ అయ్యింది. కొత్త దర్శకుడు మెహర్‌ తేజ్‌ ఈ సినిమాతో పరిచయం అవ్వబోతున్నాడు. ఫ్యామిలీ డ్రామా టైటిల్‌ తో కాన్సెప్ట్‌ పోస్టర్‌ ను విడుదల చేశారు.

కాన్సెప్ట్‌ పోస్టర్‌ చాలా ఇంట్రెస్టింగ్‌ గా ఉంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. కంచె కు అవతలి వైపు ఉన్న హీరో సీరియస్ గా చూస్తు ఉన్నాడు. పోస్టర్‌ వాటర్‌ పెయింట్‌ లుక్ లో ఉండటంతో పాటు సుహాస్ బ్యాక్ గ్రౌండ్‌ లో బ్లేడ్‌ ఉండి.. దానికి రక్తం చుక్కలు కారుతున్నట్లుగా కూడా చూపించారు.

ఇక టైటిల్ కు పక్కన వీల్‌ చైర్‌ లో ఒకరు కూర్చుని ఉండగా.. ఎదురుగా ఒకరు నిల్చుని ఉన్నారు. మొత్తానికి ఈ పోస్టర్‌ చాలా విషయాలను చెబుతూ ఉంది. ఈ కాన్సెప్ట్‌ పోస్టర్ తో ఫ్యామిలీ డ్రామా సినిమా పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.

ఈ సినిమాకు ప్రముఖ టెక్నీషియన్స్ మరియు నటీ నటులు వర్క్‌ చేయబోతున్నారు. అందుకే ఈ సినిమా తప్పకుండా సుహాస్‌ కు మరో సక్సెస్ ను కట్టబెడుతుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. కలర్‌ ఫొటో సినిమాలో హీరోయిన్‌ ముద్దుగా కన్నయ్య అంటూ హీరోను పిలుస్తుంది. దాంతో సుహాస్‌ ను చాలా మంది కన్నయ్య అంటూ పిలుస్తున్నారు.

ఫ్యామిలీ డ్రామా సినిమా తో సుహాస్ కు కన్నయ్య ఇమేజ్ పోయి కొత్త పాత్ర ఇమేజ్ వస్తుందా చూడాలి. ఫ్యామిలీ డ్రామా సినిమా కు సంబంధించిన పూర్తి వివరాలను అతి త్వరలోనే వెళ్లడించనున్నట్లుగా యూనిట్‌ సభ్యులు పేర్కొన్నారు. సుహాస్‌ కు ఈ సినిమా కూడా సక్సెస్ ను తెచ్చి పెడితే ఫుల్ టైమ్‌ హీరోగా ఆయన మారిపోవచ్చు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కథల ఎంపిక విషయంలో కాస్త శద్ర పెట్టి కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌ సినిమా లను ఎంపిక చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మంచి హీరోగా సుహాస్‌ కెరీర్ లో నిలిచి పోతాడనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.