Begin typing your search above and press return to search.
వీడియో : అందాల రాక్షసి 'కన్నానులే..' కవర్ సాంగ్
By: Tupaki Desk | 2 Sept 2020 9:00 AM ISTయూట్యూబ్ లో ఈమద్య స్టార్స్ మరియు సెలబ్రెటీలు వరుసగా జాయిన్ అవుతున్నారు. తమ ఆదాయాన్ని మరింతగా పెంచుకునే ఉద్దేశ్యంతో యూట్యూబ్ ఛానెల్ ను నిర్వహిస్తున్న ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఈ జాబితాలో అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి జాయిన్ అయ్యింది. తన యూట్యూబ్ ఛానెల్ లో మొదటి వీడియోను నిన్న అప్ లోడ్ చేసింది. ఆ మొదటి వీడియో మణిరత్నం క్లాసిక్ మూవీ 'ముంబాయి'లోని కన్నానులే అనే పాటకు కవర్. అందమైన లొకేషన్ లో సింపుల్ టేకింగ్ తో లావణ్య త్రిపాఠి మరియు ఉమాంగ్ గుప్త అనే మరో యువతి కలిసి డాన్స్ చేశారు.
బ్యాక్ గ్రౌండ్ లో అద్బుతమైన ఆకుపచ్చటి అడవి. అందులో ప్రశాంతమైన ఒక రోడ్డు. ఆ రోడ్డుపై వైట్ డ్రస్ లో లావణ్య త్రిపాఠి మెరిసింది. స్నేహితురాలు ఉమాంగ్ గుప్తతో కలిసి ఆమె వేసిన స్టెప్పులు వావ్ అనిపించేలా ఉన్నాయి. వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. పాటతో పాటు మంచి డాన్స్ కూడా ఉండటం మరియు అందమైన లొకేషన్ కూడా అవ్వడంతో కన్నుల పండుగగా వీడియో ఉంది.

తన యూట్యూబ్ ఛానెల్ ను ఈ పాటతో షురూ చేసిన లావణ్య త్రిపాఠి ముందు ముందు మరెన్ని వీడియోలు చేయనుందో చూడాలి. ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె 'ఏ1 ఎక్స్ ప్రెస్' చిత్రంలో సందీప్ కిషన్ కు జోడీగా నటిస్తోంది. ఒక వెబ్ సిరీస్ లో కూడా ఈమె నటించే అవకాశముందంటూ వార్తలు వస్తున్నాయి.