Begin typing your search above and press return to search.

కింగ్ నాగార్జున కు పోటీగా క‌న్న‌డ స్టార్‌!

By:  Tupaki Desk   |   12 July 2022 6:30 AM GMT
కింగ్ నాగార్జున కు పోటీగా క‌న్న‌డ స్టార్‌!
X
కింగ్ నాగార్జున హీరోగా రూపొందుతున్న యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ 'ది ఘోస్ట్‌'. ప్ర‌వీణ్ స‌త్తారు దర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ఎల్ ఎల్ పీ బ్యాన‌ర్ పై సునీల్ నారంగ్‌, పుస్కూర్ రామ్మోహ‌న్ రావు, శ‌ర‌త్ మ‌రార్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్ నెట్టింట సంద‌డి చేస్తున్నాయి. తాజాగా ఈ మూవీ టీజ‌ర్ నికిల్లింగ్ మిష‌న్ పేరుతో రిలీజ్ చేశారు. నాగార్జున‌ని డిఫ‌రెంట్ గా ప్ర‌జెంట్ చేసిన ఈ టీజ‌ర్ తో ఈ మూవీపై భారీ అంచ‌నాలు నెలకొన్నాయి.

అక్టోబ‌ర్ 5న ఈ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు. ఇదిలా వుంటే ఈ మూవీ టైటిల్ తో క‌న్న‌డ స్టార్ పునీత్ రాజ్ కుమార్ న‌టించిన 'ఘోస్ట్‌' మూవీ రిలీజ్ కాబోలోంది. క‌న్న‌డ ఇండ‌స్ట్రీలో కింగ్ ఆఫ్ ఆల్ మాసెస్ గా పేరు తెచ్చుకున్న శివ‌రాజ కుమార్ ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రమిది. క‌న్న‌డ మూవీ 'బీర్బ‌ల్‌' ఫేమ్ శ్రీ‌ని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా క‌న్న‌డ‌లో రూపొందుతున్న ఈ మూవీని క‌న్న‌డ‌, తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో ఏక కాలంలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయ‌బోతున్నారు.

క‌న్న‌డ స్టార్ శివ‌రాజ్ కుమార్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ని మంగ‌ళ‌వారం మేక‌ర్స్ విడుద‌ల చేశారు. రాజ‌కీయ నాయ‌కుడు, నిర్మాత సందేష్ నాగ‌రాజ్ త‌న సందేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై ఈ మూవీ భారీ స్థాయిలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. క‌న్న‌డ‌లో ఇంత వ‌ర‌కు రాని సరికొత్త క‌థ‌తో యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ గా తెర‌కెక్కిస్తున్నారు. ఈ మూవీలోని మెయిన్ థీమ్ భాష‌తో సంబంధం లేకుండా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌తో పాటు పాన్ ఇండియా వైడ్ గా ఆక‌ట్టుకోనున్న నేప‌థ్యంలో ఈ మూవీని ఐదు భాష‌ల‌లో విడుద‌ల చేయ‌బోతున్నారు.

మంగ‌ళ‌వారం హీరో శివ‌రాజ్ కుమార్ పుట్టిన రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్ ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. టైటిల్ పోస్ట‌ర్ లో గ‌న్, కార్ క‌లిపి చేసిన డిజైన్‌.. సెర్చ్ లైట్‌, బైక‌ర్స్‌.. క‌నిపిస్తుండ‌గా ప‌క్క‌నే హీరో శివ‌రాజ్ కుమార్ డిఫ‌రెంట్ లుక్ తో గ‌న్ ప‌ట్టుకుని సీరియ‌స్ లుక్ తో క‌నిపిస్తున్న తీరు, ప‌క్కనే ఓ పెద్ద బిల్డింగ్‌ పై నుంచి రాలిప‌డుతున్న మ‌నుషులు.. డిఫ‌రెంట్ గా బ్లాక్ అండ్ డార్క్‌ థీమ్ తో డిజైన్ చేసిన పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది.

ఈ మూవీకి టాప్ టెక్నిషియ‌న్స్ వ‌ర్క్ చేస్తున్నారు. క‌న్న‌డ‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ గా నిలిచిన త‌గ‌రు, స‌ల‌గ, 'బీర్బ‌ల్' ఎం.వి వంటి చిత్రాల‌కు మాట‌లు అందించిన ప్ర‌స‌న్న ఈ చిత్రానికి సంభాష‌ణ‌లు అందించారు. కేజీఎఫ్ తో దేశ వ్యాప్తంగా గుర్తింపుని సొంతం చేసుకున్న ఆర్ట్ డైరెక్ట‌ర్ శివ‌కుమార్ ఈ చిత్రానికి క‌ళా దర్శ‌కుడిగా ప‌నిచేస్తున్నారు. ఐరావ‌త‌, హ‌త‌వాది, మ‌ణ్ణిన ధోని, అసుర వంటి హిట్ చిత్రాల‌ని అందించిన సందేష్ నాగ‌రాజ్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఆగస్టు చివ‌రి వారంలో ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

అంతా ఓకే కానీ ఈ మూవీ థీమ్ పోస్ట‌ర్స్ అంతా కింగ్ నాగార్జున 'ది ఘోస్ట్' మూవీ పోస్ట‌ర్స్ ని పోలి వుండ‌టం, టైటిల్ కూడా ద‌గ్గ‌ర‌గా వుండ‌టంతో కింగ్ నాగ్ అభిమానుల‌తో పాటు, ఆడియ‌న్స్ ని క‌న్న‌డ స్టార్ శివ‌రాజ్ కుమార్ న‌టిస్తున్న 'ఘోస్ట్‌' క‌న్ఫ్యూజ‌న్ కు గురిచేసే అవ‌కాశం వుంద‌ని, నాగ్ సినిమాకు పోటీగానే ఈ మూవీని చేస్తున్నారా అని కామెంట్ లు వినిపిస్తున్నాయి. టైటిల్ తో పాటు పోస్ట‌ర్ థీమ్ కూడా ఒకే త‌ర‌హాలో వుండ‌టంతో కింగ్ నాగార్జున కు పోటీగా క‌న్న‌డ స్టార్ ఈ మూవీ చేస్తున్నారా? అని అంతా కామెంట్ లు చేస్తున్నారు.