Begin typing your search above and press return to search.

బాలయ్య మూవీలో కన్నడ స్టార్..?

By:  Tupaki Desk   |   28 Dec 2020 8:30 AM GMT
బాలయ్య మూవీలో కన్నడ స్టార్..?
X
బోయపాటి శ్రీను-బాలయ్య కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రం బీబీ-3. సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల తర్వాత వీరి కాంబోలో వస్తున్న ఈ చిత్రం కోసం నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు.
బోయపాటి-బాలయ్య హ్యాట్రిక్ మూవీ కావడంతో ఇటు ఫ్యాన్స్ తోపాటు, అటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి బీబీ3 మీద.

ఈ సినిమా ప్రస్తుతం శరవేంగా కొనసాగుతోంది. కీలకమైన యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్. వీటి సీక్వెన్స్ కోసం పిడుగురాళ్లలో ఓ లోకేషన్ చూసి ఫైనల్ చేశారట. పూర్తిగా పలుకురాళ్ళతో నిండిన ఓ గుట్టకు సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన లొకేషన్స్ లో బాలయ్య యాక్షన్ సీన్ కండక్ట్ చేయబోతున్నారని సమాచారం.

అయితే.. లెటేస్ట్ ఈ చిత్రానికి సంబంధించి ఓ గాసిప్ తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ ఓ గెస్ట్ రోల్ లో నటిస్తున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. బాలయ్య మూవీలో పునీత్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని సమాచారం. పునీత్ సినిమా ఇంటర్వెల్ లో వస్తారని కూడా ప్రచారంలో ఉంది. అయితే.. ఈ వార్త పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

కాగా.. ఇక ఈ సినిమా ఫుల్ యాక్షన్ తో పాటు ఎమోషనల్ గానూ ఉంటుందని ఇప్పటికే బోయపాటి ఆ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్, పూర్ణ నటిస్తున్నారు. మరొక ప్రముఖ నటుడు శ్రీకాంత్ ఇందులో నెగెటివ్ రోల్ చేస్తుండగా.. ప్రధాన ప్రతినాయకుడు ఎవరనేది ఇంకా బయటపెట్టలేదు టీమ్. ద్వారక క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు.