Begin typing your search above and press return to search.

కన్నడ ఫ్యాన్స్‌ మనకంటే ఒకఆకు ఎక్కువే చదివారే

By:  Tupaki Desk   |   8 Nov 2019 1:30 AM GMT
కన్నడ ఫ్యాన్స్‌ మనకంటే ఒకఆకు ఎక్కువే చదివారే
X
స్టార్‌ హీరోల ఫ్యాన్స్‌ అంటే ఒకప్పుడు విడుదల సమయంలో థియేటర్ల వద్ద సందడి చేసే వారు. వారి బర్త్‌ డేలకు ఏదైనా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ హంగామా చేసేవారు. కాని ఇప్పుడు స్టార్‌ హీరోల ఫ్యాన్స్‌ ప్రతి రోజు కూడా సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తూనే ఉన్నారు. ఆ హీరో ఫ్యాన్స్‌ ఈ హీరో ఫ్యాన్స్‌ అనే తేడా లేకుండా ఏ హీరో ఫ్యాన్స్‌ అయినా కూడా సోషల్‌ మీడియాలో తమ హీరో పేరును ట్రెండ్‌ చేసేందుకు విపరీతంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

ఈ జాబితాలో ముందు ఉండే వారు తమిళ స్టార్‌ హీరోల ఫ్యాన్స్‌. వారు చాలా వరకు సోషల్‌ మీడియాలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ మీమ్స్‌ క్రియేట్‌ చేసుకుంటూ ఉంటారు. తమిళ స్టార్‌ హీరోల ఫ్యాన్స్‌ వార్‌ ఏ స్థాయికి చేరిందో ఆమద్య జరిగిన ఒక సంఘటనతో తెల్సిందే. ఆ తర్వాత తెలుగు హీరోల ఫ్యాన్స్‌ కూడా సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉంటారు. తమ అభిమాన హీరోల గురించి సోషల్‌ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక విషయం గురించి చర్చింస్తూ సందడి చేస్తారు.

ఈమద్య కాలంలో స్టార్‌ హీరోల సినిమా టీజర్‌ లు.. ట్రైలర్‌ లు.. పాటలు యూట్యూబ్‌ రికార్డుల గురించి చర్చ జరుగుతోంది. తమ హీరో ట్రైలర్‌ అత్యధిక వ్యూస్‌ ను దక్కించుకున్నాయి అంటే తమ హీరో ట్రైలర్‌ అత్యధిక యూట్యూబ్‌ లైక్స్‌ ను దక్కించుకున్నాయి అంటూ అభిమానులు లెక్కలు వేసి మరీ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటి వరకు తమిళ మరియు తెలుగు ఫ్యాన్స్‌ మాత్రమే ఇలా చేసేవారు. మొదటి సారి కన్నడ స్టార్‌ హీరో అభిమానులు కూడా ఈ దారిలో పడుతున్నారు.

కన్నడ సూపర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌ కుమార్‌ హీరోగా నటించిన యువరత్న చిత్రం టీజర్‌ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ టీజర్‌ ఎలాగూ అత్యధిక వ్యూస్‌ ను అయితే దక్కించుకోలేదు. అలాగే లైక్స్‌ ను కూడా రాబట్టి సౌత్‌ రికార్డును రాబట్టలేదు. అందుకే విభిన్నంగా అత్యధిక కామెంట్స్‌ వచ్చిన టీజర్‌ గా రికార్డును దక్కించుకోవాలనే ఉద్దేశ్యంతో పునీత్‌ రాజ్‌ కుమార్‌ ఫ్యాన్స్‌ చాలా గట్టిగా ప్రయత్నాలు చేశారు.

వారు ఆశించినట్లుగానే సౌత్‌ లోనే అత్యధిక కామెంట్స్‌ వచ్చిన వీడియోగా యువరత్న టీజర్‌ నిలిచింది. లక్ష కామెంట్స్‌ తో సౌత్‌ లోనే నెం.1 గా ఈ టీజర్‌ నిలిచింది అంటూ పునీత్‌ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో డబ్బా కొట్టుకుంటున్నారు. పునీత్‌ ఫ్యాన్స్‌ ను చూస్తే తమిళ హీరోల ఫ్యాన్స్‌ మరియు మన హీరోల ఫ్యాన్స్‌ కంటే ఒక ఆకు ఎక్కువగానే చదివినట్లుగా ఉన్నారనిపిస్తుంది.