Begin typing your search above and press return to search.

మెగా అల్లుడు కోసం క‌న్న‌డ బ్యూటీ

By:  Tupaki Desk   |   16 Nov 2019 5:10 AM GMT
మెగా అల్లుడు కోసం క‌న్న‌డ బ్యూటీ
X
మెగా అల్లుడు క‌ళ్యాణ్ దేవ్ క‌థానాయ‌కుడి గా పులి వాసు ద‌ర్శ‌క‌త్వం లో ఓ సినిమా కు స‌న్నాహ‌కాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. తొలి చిత్రం `విజేత` క‌ళ్యాణ్ దేవ్ కి ఆశించిన విజ‌యాన్ని ఇవ్వ‌లేదు. అయితే న‌ట‌న‌ పై అత‌డికి ఉన్న ప్యాష‌న్ ని తెలియ‌జేసింది. అయితే ఎంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్నా హిట్టు మాత్ర‌మే ఇక్క‌డ కొల‌మానం. అందుకే ఈసారి క‌ళ్యాణ్ క‌మ‌ర్శియ‌ల్ హిట్టు కోసం గ‌ట్టి ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు. త‌ను న‌టిస్తున్న రెండో చిత్రానికి `సుప‌ర్ మ‌చ్చి` అనే టైటిల్ ను ఖ‌రారు చేసారు. ఈనెల 22 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

ఈ నేప‌థ్యం లో సినిమాకు సంబంధించి ఓ ఆస‌క్తి క‌ర రూమ‌ర్ వినిపిస్తోంది. ఇందులో క‌ళ్యాణ్ స‌ర‌స‌న‌ క‌న్న‌డ బ్యూటీ ర‌చిత రామ్ ని ఎంపిక చేసార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. మ‌రి ఇందు లో నిజ‌మెంత అన్న‌ది యూనిట్ ధృవీక‌రించాల్సి ఉంది. క‌ళ్యాణ్ దేవ్- ర‌చిత రామ్ జంట ఆన్ స్క్రీన్ పై ప‌ర్‌ పెక్ట్ గా సూట‌వుతుంద‌ని ద‌ర్శ‌కుడు భావిస్తున్నార‌ట‌.

గ‌త కొంత‌ కాలంగా ర‌చిత రామ్ పేరు సోష‌ల్ మీడియాలో బాగా హైలైట్ అయింది. బాల‌కృష్ణ క‌థా నాయ‌కుడిగా బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వం లో తెర‌కెక్క‌నున్న చిత్రం లో ఒక క‌థానాయిక‌ గా ఎంపికైంద‌ని ప్ర‌చారం సాగింది. దీంతో ర‌చిత ఫోటోలు సోష‌ల్ మీడియా లో ఓ రేంజ్ లో వైర‌ల్ అయ్యాయి. తాను ఇంకా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వ‌క ముందే కావాల్సినంత ప్ర‌చారం ద‌క్కింది. మ‌రి ఈ రెండు సినిమాల్లో ర‌చిత రామ్ ఎంపికైందా? లేదా? అన్న‌ది అదికారికంగా తెలియాల్సి ఉంది.