Begin typing your search above and press return to search.

ఆ హీరోపై లైంగిక వేధింపుల కేసు!

By:  Tupaki Desk   |   31 July 2018 2:20 PM GMT
ఆ హీరోపై లైంగిక వేధింపుల కేసు!
X
గ‌త కొద్ది రోజులుగా టాలీవుడ్ - కోలీవుడ్ - మాలీవుడ్ ల‌లో క్యాస్టింగ్ కౌచ్ పై తీవ్రంగా చ‌ర్చ‌లు జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. జూనియ‌ర్ ఆర్టిస్టుల ద‌గ్గ‌ర నుంచి హీరోయిన్ల వ‌ర‌కు ....ఇండ‌స్ట్రీలో ప‌నిచేస్తోన్న చాలా మంది మ‌హిళ‌లు క్యాస్టింగ్ కౌచ్ పై త‌మ చేదు అనుభ‌వాల‌ను మీడియాలో - సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించారు. ముంబైలో ఓ జూనియ‌ర్ ఆర్టిస్టుపై అత్యాచారం చేసిన ఘ‌ట‌న‌లో ఓ నిర్మాత‌కు ఏడేళ్లు జైలు శిక్ష ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఆ ఘ‌ట‌న స‌ద్దుమ‌ణ‌గ‌క ముందే తాజాగా మ‌రో క‌న్న‌డ న‌టిపై లైంగిక వేధింపుల‌ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. క‌న్న‌డ సినీరంగానికి చెందిన ఓ ప్ర‌ముఖ హీరో....ఓ న‌టికి మ‌త్తుమందిచ్చి అశ్లీల చిత్రాలు రికార్డు చేసిన ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపుతోంది.

ఆ న‌టుడిపై స‌ద‌రు న‌టి కర్నాటకలోని బేగూరు పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ ఫైల్ అయిన‌ట్లు క‌న్న‌డ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. తన సినిమాలో చాన్స్ ఇస్తానని త‌న‌ను ఓ షూటింగ్ స్పాట్ కు స‌ద‌రు న‌టుడు పిలిపించాడ‌ని ఆమె ఆరోపించింది. అయితే, అక్క‌డ‌కు చేరుకోగానే షూటింగ్ క్యాన్సిల్ అయిందని చెప్పి ఆర్ ఆర్ నగర్లోని ఓ హోటల్ కు త‌న‌ను డిన్న‌ర్ కు తీసుకెళ్లాడని తెలిపింది. లంచ్ సమయంలో అత‌డు ఇచ్చిన‌ కూల్ డ్రింక్ తాగ‌గానే తాను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయానని చెప్పింది. ఆ సమయంలో తనను అశ్లీలంగా వీడియోలు చిత్రీకరించారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన డిమాండ్లు నెర‌వేర్చ‌క‌పోతే ఆ వీడియో లీక్ చేస్తానని బెదిరించి, ఇప్ప‌టివ‌ర‌కు రూ. 14 లక్షలు వసూలు చేశాడని ఆరోపించింది.