Begin typing your search above and press return to search.

దర్శకేంద్రుడి కోడలు.. వాటే ర్యాంప్ వాక్‌

By:  Tupaki Desk   |   22 Jun 2016 11:00 PM IST
దర్శకేంద్రుడి కోడలు.. వాటే ర్యాంప్ వాక్‌
X
రీసెంట్ గా వీవ్స్ అండ్ వీవర్స్ ఫ్యాషన్ షో ఒకటి హైద్రాబాద్ లో జరిగింది. ప్రముఖ డిజైనర్ ఒకరు రూపొందించిన కలెక్షన్ ను ప్రదర్శించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ షోలో పలువురు మోడల్స్ తో పాటు.. సినీ తారలు కూడా సందడి చేశారు. సీనియర్ హీరోయిన్ అమల కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి.. కొత్త మోడల్స్ ను తిలకించారు.

ఇక యంగ్ హీరోయిన్స్ అయితే ర్యాంప్ వాక్ తో అదరగొట్టేశారు. స్వీటీ అనుష్కతో పాటు పాప్ సింగర్ స్మిత కూడా ఇక్కడ ర్యాంప్ పై నడిచింది. రెజీనా కూడా ర్యాంప్ వాక్ తో సందడి చేసింది. వీళ్లంతా గ్లామర్ ప్రదర్శనలో ఎప్పటికప్పుడు ఆరితేరినవాళ్లే కావడంతో.. మరో సెలబ్రిటీ అందరి దృష్టిని ఆకర్షించేసింది. ఆమె ఎవరో కాదు.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కోడలు కనిక థిల్లాన్.

నీలం రంగు అడ్డ చారల చీర.. దానికి ఆరెంజ్ కలర్ పెద్ద అంచు.. లేత ఆకుపచ్చని చాకెట్ తో కనిక ర్యాంప్ పై అదరగొట్టేసింది. ముక్కు పుడకతో పాటు పెద్ద చెవిదిద్దులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక చీరకట్టులో అయితే కొత్త స్టైల్ తో పాటు బోలెడన్ని అందాలను కూడా చూపించింది. బొడ్డు కిందకు చీరకట్టుతో.. రాఘవేంద్రరావు కోడలు అనిపించేసింది కనిక థిల్లాన్. ఏమైనా చీర విషయంలో దర్శకేంద్రుడు నేర్పిన పాఠాలు అందరినీ ఇన్ స్పైర్ చేసేస్తాయ్ కదూ.