Begin typing your search above and press return to search.

నువ్వు అలాంటి స్క్రిప్ట్‌ లతో వస్తే నిన్ను భగవంతుడు కూడా కాపాడలేడు

By:  Tupaki Desk   |   29 Jan 2020 11:30 AM GMT
నువ్వు అలాంటి స్క్రిప్ట్‌ లతో వస్తే నిన్ను భగవంతుడు కూడా కాపాడలేడు
X
బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగనా మరియు స్టార్‌ ఫిల్మ్‌ మేకర్‌ కరణ్‌ జోహార్‌ ల మద్య ఉన్న వివాదం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పలు సందర్బాల్లో కరణ్‌ జోహార్‌ పై బాహాటంగానే కంగనా సిస్టర్స్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇద్దరి మద్య చాలా వివాదాలు ఉన్నాయంటూ మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా కంగనా పద్మశ్రీ అవార్డు దక్కించుకోవడం పట్ల కరణ్‌ జోహార్‌ స్పందించాడు.

కంగనా ఏ సినిమాలో నటించినా కూడా ఆమె తన నటనతో ఆకట్టుకునేందుకు చాలా కష్టపడతారు. అందుకే ఆ అవార్డుకు ఆమె పూర్తిగా అర్హురాలు. మా ఇద్దరిమద్య వివాదాలు ఉన్నాయంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాని అదేమి వాస్తవం కాదు. నా వద్ద ఏమైనా కథలు ఉంటే అవి కంగనాకు సూట్‌ అవుతాయి అనుకుంటే ఖచ్చితంగా ఆమెను ఏమాత్రం మొహమాటం లేకుండా సంప్రదిస్తాను అంటూ కరణ్‌ జోహార్‌ సోషల్‌ మీడియాలో కంగనాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వ్యాఖ్యలు చేశాడు.

కరణ్‌ జోహార్‌ చేసిన ఈ వ్యాఖ్యలపై కంగనా అయితే బాహాటంగా స్పందించలేదు. కాని ఆమె సోదరి రంగోలి మాత్రం కరణ్‌ జోహార్‌ గాలి తీసే విధంగా వ్యాఖ్యలు చేసింది. కంగనా కోసం నువ్వు కథ అనుకున్న వెంటనే అది చెప్పిన వెంటనే ఆమె నీ వెంట వస్తుందని, నీ కథ కోసం ఆమె ఎదురు చూస్తుందని అనుకుంటున్నావా. నీ వద్ద కంగనా స్థాయి కథలు ఉండవు. నీవు తీసిన సినిమాలో హీరోయిన్‌కు క్యాన్సర్‌ అయితే హీరో ఆమె వెంట పడి నువ్వు ఎలాగూ చనిపోబోతున్నావు. నన్ను ప్రేమించు అంటాడు. ఆ సీన్‌ చూసి కంగనా చాలా సేపు షాక్‌ అయ్యింది. అలాంటి స్క్రిప్ట్‌ లతో కనుక నువ్వు కంగనా వద్దకు వస్తే నిన్ను ఆమె నుండి ఆ దేవుడు కూడా కాపాడలేడు అంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది.