Begin typing your search above and press return to search.

అక్క తరఫున చెల్లి వకాల్తా

By:  Tupaki Desk   |   28 Jan 2019 11:59 AM GMT
అక్క తరఫున చెల్లి వకాల్తా
X
షూటింగ్ లో ఉన్నన్నాళ్ళు నివురు గప్పిన నిప్పులా ఉన్న కంగనా క్రిష్ ల మధ్య వ్యవహారం మణికర్ణిక విడుదలయ్యాక బయటికి వచ్చేసింది. ఎన్టీఆర్ బయోపిక్ మీద ఫోకస్ పోతుందని సైలెంట్ గా ఉన్న దర్శకుడు క్రిష్ ఇప్పుడు అన్ని విషయాల మీద క్లారిటీ ఇవ్వడంతో జాతీయ మీడియాలో సైతం ఇది హాట్ టాపిక్ గా మారింది. కంగనా కొన్ని సన్నివేశాలు అనవసరంగా మార్చిందని 70 శాతం తాను తీసిందే రీ షూట్ చేసిందని కుండ బద్దలు కొట్టాడు.

అంతేకాదు సోను సూద్ వ్యవహారం గురించి కూడా క్లారిటీ ఇచ్చాడు. తనను పక్కన పెట్టినందుకే సోను సూద్ బయటికి వచ్చాడని అంతేకాకుండా ఇంటర్వెల్ లో ఆ పాత్రను చంపవద్దని కోరడం గురించి వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో రచ్చ ముదురుతోందని గుర్తించిన కంగనా చెల్లి రంగోలి రంగంలోకి వచ్చింది. అక్కయ్య విజయాన్ని అస్వాదిస్తోందని దాని అడ్డు రాకని కోరుతూ సినిమా మొత్తం మీరే తీసారు అనుకుంటే తమకేమి అభ్యంతరం లేదని కాస్త రిలాక్స్ అవ్వమని వెటకారంగా గౌరవంగా రెండు మిక్స్ చేసి చెప్పింది.

ఇప్పుడు కంగనానే ముందుండి నడిపిస్తోంది కాబట్టి తనను వదిలేసి కూర్చోవడం బెటరని కాస్త వ్యంగ్యంగానే అడిగింది. చెల్లి కాబట్టి అక్కను వెనకేసుకురావడం సహజం. అయితే కాస్త వాస్తవాలను కూడా చెప్పి ఉంటే బాగుండేది. హృతిక్ రోషన్ తో మొదలుకుని ఇప్పటి క్రిష్ దాకా ప్రతి ఒక్కరితో గొడవలు పేచీ ఏదో ఒకటి పెట్టుకుంటూ వచ్చిన కంగనా తన తప్పేమీ లేదనేలా చెల్లెలితో చెప్పించినంత మాత్రాన అబద్దాలు నిజాలై పోవు కదా. అసలే మణికర్ణిక ఆశించిన స్థాయిలో ఆడటం లేదనే ఫ్రస్ట్రేషన్ కాబోలు అక్కాచెల్లెళ్ళు ఇలా రకరకాలుగా బయటపెట్టేసుకుంటున్నారు..