Begin typing your search above and press return to search.
బాలీవుడ్ 'ఫైర్ బ్రాండ్'కి సింగపూర్ ఎలా వెళ్లాలో తెలియదంట...!
By: Tupaki Desk | 29 April 2020 4:40 PM ISTబాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్... బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరు. హీరోయిన్ గానే కాకుండా దర్శకురాలిగా రచయితగా కూడా తన ప్రతిభను నిరూపించుకుంది. సినీ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ హీరోయిన్ అని చెప్పొచ్చు. అంతేకాదు హీరోలకు సైతం సవాళ్లు విసురుతూ.. ఎప్పుడూ వివాదాలతో సహవాసం చేస్తూ ఎప్పుడూ వార్తల్లో ఉంటూ వస్తోంది. కంగనా రనౌత్ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి 14 ఏళ్ళు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆమె తన కెరీర్‌ను గురించి.. ఇండస్ట్రీలో తన అనుభవాల గురించి.. ఎన్నో విశేషాలను పంచుకున్నారు. కంగనా నటించిన తొలి చిత్రం అనురాగ్ బసు దర్శకత్వం వహించిన ‘గ్యాంగ్‌స్టర్’ అనూహ్య విజయాన్ని సాధించింది. దీనిలో ఆమె నటనకు 'ఉత్తమ నూతన నటిగా ఫిలింఫేర్ అవార్డు'ను తెచ్చిపెట్టింది. తన తొలి చిత్రానికే అవార్డు రావటం ఓ అద్భుతమంటూనే ఆ అవార్డును స్వయంగా అందుకోలేదనే విషయాన్ని బయటపెట్టింది కంగన. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్న కంగనా ఒకప్పుడు ఇండస్ట్రీలో ఎన్నో అవస్థలు పడింది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆమె.. స్టార్టింగ్ లో సపోర్ట్ లేక చాలా ఇబ్బంది పడింది. తాను హీరోయిన్ గా నటించిన తొలి సినిమాకు ఉత్తమ నటిగా అవార్డు వస్తే.. అది తీసుకోవడానికి సింగపూర్‌కు వెళ్లే మార్గం కూడా తెలియలేదట.
ఈ సందర్భంగా కంగన మాట్లాడుతూ.. 'అవార్డుకు నామినేట్ అయ్యానని నాకు మొదట తెలియదు. సింగపూర్ లో జరిగే అవార్డుల కార్యక్రమానికి చిత్రబృందం వెళ్తూ.. 'నీకు వేరే ఏదైనా ప్రోగ్రాం ఉందా' అని అడిగారు. అయినా సింగపూర్ ఎలా వెళ్లాలో.. వెళ్లాక ఎక్కడ ఉండాలో.. అసలు టికెట్ ధర ఎంతో నాకేమీ తెలియదు. మా టీమ్ ను అడగటానికి సిగ్గేయడంతో నేను రాలేనని చెప్పేశాను. అలా నేను ఆ అవకాశాన్ని కోల్పోయాను. నాకు అవార్డు వచ్చిందని.. నా అవార్డును తీసుకు వస్తున్నామని మా సినిమాటోగ్రాఫర్ అయిన బాబీ సింగ్ ఫోన్ చేసి చెప్పారు. దానితో ఎంతో థ్రిల్‌కు గురయ్యాను' అంటూ కంగన వివరించింది. వాస్తవానికి కంగనా చాలా వెనుకబడిన రిమోట్ ఏరియా నుండి ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఈ స్థాయికి వచ్చింది. అందుకే ఆమెకు అలాంటి విషయాలు తెలియకపోవచ్చు.
కాగా మధుర్ భండార్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఫ్యాషన్’ సినిమాలో కంగనా నటనకు 'ఉత్తమ సహాయ నటి'గా తొలి జాతీయ అవార్డును తెచ్చిపెట్ట్టింది. ‘తను వెడ్స్ మను’ కంగనకు స్టార్ హోదాను తెచ్చిపెట్టింది. ఈ చిత్రంలో మాధవన్ కు జోడీగా ఆమె నటనకు బాలీవుడ్ ఫిదా అయింది. ఆ తర్వాత ‘క్వీన్’తో కంగనా రెండోసారి జాతీయ అవార్డును ఎగరేసుకుపోయింది. వ్యక్తిగత వృత్తి జీవితంలో ఎన్నో విమర్శలను ఒడిదొడుకులను ఎదుర్కొన్న కంగన... బహుభాషా చిత్రం ‘మణికర్ణిక’తో చిత్ర నిర్మాణంలోనూ అడుగుపెట్టారు. టాలీవుడ్ లో పూరి జగన్నాథ్ - ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన 'ఏక్ నిరంజన్' చిత్రంలో కంగన నటించింది. వాస్తవానికి 'పోకిరి' సినిమాలో హీరోయిన్ గా మొదట కంగనాకే ఆఫర్ వచ్చింది. కానీ అదే సమయంలో 'గ్యాంగ్ స్టర్' సినిమాకి డేట్స్ కేటాయించడం వలన 'పోకిరి' ఛాన్స్ మిస్ చేసుకుంది. 'పోకిరి' సినిమాలో తాను నటించి ఉంటే... టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అయ్యేదాన్నని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చిందట కంగన. ప్రస్తుతం దివంగత తమిళ ముఖ్యమంత్రి జయలలిత జీవితాధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో కంగనా నటిస్తున్నారు.