Begin typing your search above and press return to search.
గజిని జో బైడెన్ ఏడాదికి మించి బతకరు : కంగనా
By: Tupaki Desk | 9 Nov 2020 3:40 PM ISTబాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఈ మధ్య నిత్యం ఏదొక విధంగా వార్తల్లో నిలుస్తూ వస్తోంది. తాజాగా అమెరికాకు కాబోయే ప్రెసిండెంట్ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై జో బైడెన్ విజయం సాధించడంతో ఆయన అమెరికాకు 46వ అధ్యక్షుడు కానున్నాడు. అలానే భారతీయ మూలాలున్న కమలా హారిస్ అమెరికాకు 49వ ఉపాధక్షురాలిగా ఎన్నిక కానున్నారు. ఆమె అమెరికాకు ఫస్ట్ మహిళా ఉపాధ్యక్షురాలుగా, మొదటి ఇండియన్ అమెరికన్ ఉపాధ్యక్షురాలుగా, మొదటి నల్లజాతి మహిళా ఉపాధ్యక్షురాలుగా, మొదటి దక్షిణ ఆసియా అమెరికన్ మహిళా ఉపాధ్యక్షురాలుగా చరిత్రకెక్కనున్నారు. దీంతో ఆమెకు అందరూ పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఈ నేపథ్యంలో కమలా హారిస్ 'నేను ఫస్ట్ అయ్యుండొచ్చు.. కానీ నేను లాస్ట్ కాదు'' అని ట్వీట్ చేసింది. దీనికి స్పందించిన కంగనా 'జో బైడెన్ ఏడాదికి మించి బతకరని.. ఆ తర్వాత మొత్తం షో రన్ చేసేది వైస్ ప్రెసిండెంట్ కమలా హారిస్' అని వివాదాస్పద ట్వీట్ చేసింది. ''ప్రతి 5 నిమిషాలకు డేటా క్రాష్ అయిపోయే గజిని జో బైడెన్. ఆయనకు ఎక్కించిన మందుల వల్ల ఏడాదికి మించి బతుకుతారని అనుకోవడం లేదు. క్లియర్ గా కమలా హారిస్ షో రన్ చేస్తారు. ఒక మహిళ ఎదిగితే మరింత మంది మహిళలు ఎదిగేందుకు దోహదం చేస్తారు'' అని కంగనా రనౌత్ ట్వీట్ చేశారు.