Begin typing your search above and press return to search.

బాలీవుడ్ ని తిరస్కరించండి : కంగనా సంచలన ట్వీట్...!

By:  Tupaki Desk   |   16 Oct 2020 2:44 PM IST
బాలీవుడ్ ని తిరస్కరించండి : కంగనా సంచలన ట్వీట్...!
X
హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తరువాత బాలీవుడ్ లో నెపోటిజం - డ్రగ్ వ్యవహారాలపై హీరోయిన్ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇండస్ట్రీలోని డర్టీ సీక్రెట్స్ అంటూ ట్వీట్ చేస్తూ.. బాలీవుడ్ ని బుల్లీవుడ్ గా పేర్కొంటూ ఇండస్ట్రీపై నిప్పులు చెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఓ వర్గం ప్రముఖులు కంగనా పై గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. అయినా సరే అవేమీ లెక్క చేయకుండా ఫైర్ బ్రాండ్ కంగనా తనదైన శైలిలో అభిప్రాయాలను వెల్లడిస్తూ ఫైర్ అవుతూనే వచ్చింది. ఈ క్రమంలో తాజాగా మరోసారి బాలీవుడ్‌ పై నిప్పులు చెరిగింది కంగనా.

"భారతీయ చిత్ర పరిశ్రమలో ఆర్టిస్టులు కళాకారులతో పాటు బాలీవుడ్‌ ఇండస్ట్రీ కూడా ఉంది. చాలా హాస్యాస్పదమైన విషయమేమంటే బాలీవుడ్‌ అనే పదం హాలీవుడ్‌ నుండి కాపీ చేసి దొంగిలించబడింది. కాబట్టి దయచేసి అవమానకరమైన బాలీవుడ్‌ పదాన్ని తిరస్కరించండి'' అని #IndiaRejectBollywood హ్యాష్ ట్యాగ్ తో ఘాటుగా ట్వీట్ చేసింది కంగనా రనౌత్‌. ఈ వ్యాఖ్యలపై బాలీవుడ్ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి. కంగనా రనౌత్‌ ప్రస్తుతం తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ 'తలైవి'లో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌ లో జరుగుతోంది.