Begin typing your search above and press return to search.

ఆమెకు నేను పూర్తి వ్యతిరేకం.. అయినా చేస్తా

By:  Tupaki Desk   |   2 April 2019 10:35 AM GMT
ఆమెకు నేను పూర్తి వ్యతిరేకం.. అయినా చేస్తా
X
తమిళనాట సినీ మరియు రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసిన మాజీ ముఖ్యమంత్రి, హీరోయిన్‌ అయిన జయలలిత బయోపిక్‌ లో బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ నటించబోతున్న విషయం తెల్సిందే. విజయ్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందబోతున్న బయోపిక్‌ షూటింగ్‌ కు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ చిత్రంకు హిందీలో 'జయ' అనే టైటిల్‌ ను రిజిస్ట్రర్‌ చేశారు. తమిళం మరియు హిందీలో ఈ చిత్రంను తెరకెక్కించనున్నారని, తెలుగులో డబ్బింగ్‌ చేసి విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో నటించబోతున్నందుకు కంగనా భారీ పారితోషికం పుచ్చుకుంటుందనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున వస్తుంది.

ఇక ఈ చిత్రంలో నటించడంపై కంగన రనౌత్‌ మాట్లాడుతూ... జయలలిత గారి బయోపిక్‌ లో నటించాల్సిందిగా అడిగేందుకు కొందరు నా వద్దకు వచ్చిన సమయంలో ఆమె ఫొటోలు తీసుకు వచ్చారు. ఆమె ఫొటోలు, పుస్తకాలు, వీడియోలు చూసిన తర్వాత ఆమె గురించి ఒక అవగాహణకు వచ్చి చేస్తానంటూ ఓకే చెప్పాను. జయలలిత గారి కొన్ని విషయాలు నాకు ఆశ్చర్యంను కలిగించాయి. ఒక మహిళ నటిగా, రాజకీయ నాయకురాలిగా ఎంతో పెద్ద స్థాయికి వెళ్లడం, ఆమె జీవితంలోని మలుపులు నాకు చాలా ఆసక్తిగా అనిపించాయి.

జయలలిత గారి స్వభావం నా స్వభావం పూర్తి వ్యతిరేకం. ఆమె ప్రతి విషయంలో, ప్రతి ఒక్కరి పట్ల విధేయత, వినయంతో ఉండే వారు. ఏదైనా సాధించాలనుకుంటే ఏ మార్గంలో అయినా వెళ్లి సాధించాలని భావించేవారు. అలా వెళ్లిన సమయంలో తర్వాత పరిణామాల గురించి ఆలోచించే వారు కాదు. కాని నేను మాత్రం అలా కాదు. జయలలిత గారి ప్రవర్తన, వ్యక్తిత్వంకు నాది పూర్తి విరుద్దంగా ఉంటుంది. ఆమె ఎదుర్కొన్న కష్టాలు చూసి చలించి పోయాను అంటూ కంగనా చెప్పుకొచ్చింది. ఆమె గురించి తెలుసుకుని నటించేందుకు ఒప్పుకున్నాను అంటూ చెబుతున్నా, యూనిట్‌ సభ్యులు ఆఫర్‌ చేసిన భారీ పారితోషికంకు ఆమె 'తలైవి' సినిమాకు కమిట్‌ అయ్యిందని కొందరు అంటున్నారు.