Begin typing your search above and press return to search.

కంగనా మళ్ళీ ఉతికి ఆరేస్తోందా??

By:  Tupaki Desk   |   2 Oct 2016 10:25 AM IST
కంగనా మళ్ళీ ఉతికి ఆరేస్తోందా??
X
ఆ మధ్యన తనకు హృతిక్ రోషన్ తో ఎటువంటి గొడవలు లేవని.. తన మీద ఎవ్వరూ కేసులు పెట్టేలదని.. పేర్కొంటూ.. ఇన్ డైరెక్టుగా తనకు హృతిక్ పెట్టిన కేసుల నుండి ఉద్వాసన లభించినట్లు సెక్సిణి కంగనా రనౌత్ పేర్కొంది. 'సిల్లీ ఎక్స్' అంటూ హృతిక్ గురించి సంబంధించి.. ఏవేవో పర్సనల్ విషయాల గురించి చెప్పి.. కంగన సంచలనాలకు తెరలేపిన సంగతి తెలిసిందే.

ఆ తరువాత హృతిక్ ఈమెపై ట్వీట్లు వేయడమే కాకుండా కేసులు కూడా పెట్టాడు. ఏవేవో ఈమెయిల్స్ అంటూ హాలీవుడ్ వైట్ హౌస్ స్కాములను తలపించే రేంజులో ఆరోపణల పర్వం కొనసాగింది. సడన్ గా సైలెన్స్. వీళ్ళిద్దరి మధ్యనా సెటిల్మెంట్ జరిగిందని బాలీవుడ్ లో వినిపించింది. అయితే ఇదే విషయంపై కంగన మాత్రం కేసులు లేవని చెబితే.. హృతిక్ తండ్రి రాకేష్‌ రోషన్ మాత్రం తన కొడుకు నోరు విప్పితే కొందరి జీవితం చిన్నాభిన్నం అవుతుందని.. నిజాలు చాలా గొప్పవని చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్లతో మండిందో ఏమో కాని కంగన మళ్లీ ఉతికి ఆరేస్తోంది.

''భారతీయ పురుషులు ఎందుకు తమ కాళ్ల మీద నిలబడరు? 43 ఏళ్ల వయస్సు వచ్చిన కొడుకుని తండ్రి రక్షించాల్సిన అవసరం ఏమొచ్చింది?'' అంటూ ఘాటుగా స్పందించింది కంగనా. చూస్తుంటే మరోసారి వివాదం మరోసారి రాజుకునేట్లు ఉందిలే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/